Ram Charan Birthday : రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు… మెగా ఫ్యాన్స్ అందరూ కూడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కోసం వెయిట్ చేస్తున్నారు. మెగా కుటుంబానికి వారసుడు కాబట్టి… సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేయాలని చూడటం ఒక కారణం అయితే… మరో కారణం… RC 16 అప్డేట్ అని చెప్పొచ్చు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఆ మూవీ గ్లింప్స్‌ను రామ్ చరణ్ బర్త్ డే అయిన మార్చి 27న రిలీజ్ చేస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు.
అయితే రామ్ చరణ్ మాత్రం ఆ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని చూస్తున్నట్టు సమాచారం. అలాగే RC 16 మూవీ నుంచి గ్లింప్స్‌ను రిలీజ్ చేయాడానికి కూడా చరణ్ ఆసక్తి చూపించడం లేదని టాక్. దీనికి కారణం ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని తెలుస్తుంది. అది ఏంటో, పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం…
ప్రతి సంవత్సరం మార్చి 27న మెగా ఫ్యాన్స్ ఓ పండగ లాంటిది. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే ఆ రోజే. ప్రతి ఏడాది మెగా ఫ్యామిలీ వారసుడు చరణ్ బర్త్ డే ని మెగా ఫ్యాన్స్ అందరూ చాలా గ్రాండ్‌గా సెలబ్రెట్ చేస్తారు. ఈ సారి కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. అలాగే ఇప్పుడు RC 16 మూవీ ఉండటంతో… ఆ మూవీ నుంచి గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉండటంతో… ఫ్యాన్స్ ఎదురుచూపులు రెట్టింపు అయ్యాయి.
బర్త్ డే సెలబ్రేషన్స్‌కి దూరం..?
అయితే… ఈ ఏడాది రామ్ చరణ్ దూరంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని సమాచారం. రామ్ చరణ్ అమ్మమ్మ… అల్లు అరవింద్ వాళ్ల అమ్మ (వయసు 95 ఏళ్లు) ఆనారోగ్యంతో ఉందట. ప్రస్తుతం ఆమె ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పైన చికిత్స తీసుకుంటుందట. ఇలాంటి టైంలో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రామ్ చరణ్ ఆసక్తి చూపించడం లేదుని టాక్.
RC 16 గ్లీంప్స్ కూడా వాయిదా..?
రామ్ చరణ్ – బుచ్చి బాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న RC 16 మూవీ నుంచి కూడా అప్డేట్ రాబోతుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లీంప్స్‌ను డైరెక్టర్ బుచ్చి బాబు సాన రెడీ చేశాడట. బర్త్ డే రోజు రిలీజ్ చేయాలని అనుకున్నారట. కానీ, రామ్ చరణ్ దానికి అంగీకరించలేదని టాక్. దీంతో RC 16 గ్లీంప్స్ రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉంది.