Anchor Shiva Jyothi:రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన విషయం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. ముఖ్యంగా లక్షలాది మంది ఫాలోవర్స్ కలిగి ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మొదలుకొని.. వేల మంది అభిమానులను సొంతం చేసుకున్న సెలబ్రిటీల వరకు చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదు చేయగా.. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఒక్కొక్కరికి సంబంధించిన వీడియోలను బహిరంగంగా బయట పెడుతూ వారిపై కేసులు నమోదయ్యేలా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే దగ్గుబాటి రానా (Rana Daggubati) మొదలుకొని.. ప్రకాష్ రాజ్ (Prakash Raj), బాలకృష్ణ (Balakrishna ) మంచు లక్ష్మి (Manchu Lakshmi) ఇలా దాదాపు 25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అయ్యింది.
అరెస్ట్ అయ్యేవరకు వదిలేలా లేరే..
ఇలాంటి సమయంలో చాలామంది సెలబ్రిటీలు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తుంటే.. మరి కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రముఖ యాంకర్ శివజ్యోతి (Anchor Shiva Jyothi) కూడా చిక్కుల్లో పడ్డారు. ఈమె కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఈమెపై పోలీసులు మాత్రం కేసు ఫైల్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఈమె బెట్టింగ్ ప్రమోట్ చేసిన వీడియోలను సాక్షాలతో సహా పోలీసులకు అప్పగించి, ఈమెపై ఎందుకు కేసు ఫైల్ చేయలేదు అంటూ పలువురు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. అసలు విషయంలోకెళితే, ప్రముఖ యాంకర్ శివజ్యోతి తన ఇంస్టాగ్రామ్ వేదికగా 1XBAT కి సంబంధించిన @betbricks7 అనే బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసింది. ఇప్పుడు ఆమె ప్రమోట్ చేసిన ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. శివజ్యోతి అలియాస్ సావిత్రి బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసినట్లు ఆధారాలు లభించాయి. ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా కూడా ఆమెపై కేసు నమోదు చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు సార్.. కనీసం ఇప్పటికైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారా ? అంటూ వీసీ సజ్జనార్ ను ట్యాగ్ చేయడమే కాకుండా.. హైదరాబాద్ సిటీ పోలీసులకు ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఏ క్షణమైన శివ జ్యోతి పై కేసు ఫైల్ చేసి ఆమెను విచారణకు పిలిచే అవకాశాలున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇప్పుడు ఇతరుల వల్ల భారీగా చిక్కుల్లో పడింది శివజ్యోతి అని చెప్పవచ్చు. ఇక ఇది చూసిన కొంతమంది శివ జ్యోతి అరెస్టు అయ్యేవరకు వదిలేలా లేరే అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటికే 25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్..
ఇకపోతే 25 మంది సెలబ్రిటీలపై కేసు ఫైల్ అవ్వగా మరొకవైపు యూట్యూబర్స్ పై కూడా కేసు ఫైల్ అయింది. అందులో యూట్యూబర్ నాని అరెస్టయ్యారు. హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్ లపై కేసు నమోదయింది. వీరిని అరెస్టు చేయాల్సి ఉండగా వీరు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే భయ్యా సన్నీ యాదవ్ , ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి ప్రధాన పాత్రలు పోషించారని, వీరే ఎక్కువ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేసి భారీగా డబ్బు సొంతం చేసుకోవడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని, వీరిని తక్షణమే అరెస్టు చేయాలని కూడా పలువురు నెటిజన్స్ కోరుతున్నారు .ఇక వీరిపై ఎప్పుడైనా సరే వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
I don’t understand why @iamshivajyothi is so special. Despite having a clear evidence and lodged a complaint yet the case is not registered on her? What stopping you to file the case and Who safeguarding her sir? @Shikhagoel_IPS @hydcitypolice @Cyberdost @CyberCrimeshyd… https://t.co/cJSSAe5TOV pic.twitter.com/aparPWGlBR
— Tharun Reddy (@Tarunkethireddy) March 24, 2025