Sampath Nandi : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో సంపత్ నంది ఒకరు. మొదట రామ్ చరణ్ తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ అప్పటికే రామ్ చరణ్ కి మగధీర సినిమాతో మంచి క్రేజీ వచ్చేసింది. సో ఉన్నఫలంగా కొత్త డైరెక్టర్ తో సినిమా చేయడం కరెక్ట్ కాదు అని అనుకుని ముందు ఒక చిన్న కథ చేసిన తర్వాత ఈ కథ మనం చేద్దామని రామ్ చరణ్ చెప్పాడట. అప్పుడు సంపత్ నంది ఏమైంది ఈవేళ అనే సినిమాను వరుణ్ సందేశ్ తో తెరకెక్కించి డీసెంట్ హిట్ అందుకొని చరణ్ రచ్చ సినిమాను చేశాడు.
అప్పటికే ఆరెంజ్ సినిమా తర్వాత ప్లాప్ లో ఉన్న చరణ్ కి రచ్చ సినిమాతో మంచి హిట్ అందింది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ను చాలా ఎనర్జీతో చూపించాడు సంపత్ నంది. ఈ సినిమాలో మెగాస్టార్ మేనరిజం కూడా చాలా వరకు చూపించాడు సంపత్. ఇకపోతే రవితేజ గోపీచంద్ అండ్ హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్నాడు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ తో కూడా సంపత్ నంది సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చాయి. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి అది కుదరలేదు. సంపత్ నంది చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిన కూడా ఇప్పటికీ చాలామందికి నచ్చుతాయి అని చెప్పొచ్చు.
ప్రస్తుతం సంపత్ నంది శర్వానంద్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తమన్నా నటిస్తున్న ఓదెల 2 సినిమాను సంపత్ నంది సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన పలు ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు సంపత్ నంది. ఎన్నో ఆసక్తికరమైన విషయాలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నాడు. మళ్లీ రామ్ చరణ్ తో ఎందుకు సినిమా చేసే ప్రయత్నం చేయలేదు అని ఒక జర్నలిస్టు అడిగినప్పుడు సంపత్ నంది చాలా క్లారిటీగా సమాధానం చెప్పాడు.
నాకు అంత మార్కెట్ లేదు
రచ్చ సినిమా చేసిన తర్వాత నేను బెంగాల్ టైగర్ సినిమాను చేశాను. ఆ తర్వాత వరుసగా నా సినిమాలు నేను చేసుకుంటూ ముందుకెళ్లిపోయాను. ఈలోపు రామ్ చరణ్ మార్కెట్ పెరిగిపోయింది. ఒక కాంబినేషన్ ఇప్పుడు సమఉజ్జీలో ఉండాలి. నాకిప్పుడు 500 కోట్లు మార్కెట్ ఉంటే నేను రామ్ చరణ్ తో సినిమాను చేయొచ్చు. అంతేకాకుండా ఒక కొత్త దర్శకుడు కి కొన్నిసార్లు అవకాశం వస్తుంది కానీ ఆల్రెడీ ప్రూవ్ బై ఒక ట్రాక్ ఉన్న దర్శకుడికి అలాంటి అవకాశం రావడం అనేది కష్టంగా ఉంటుంది. అంటూ రామ్ చరణ్ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : Nani: చాలా స్టుపిడ్ కాన్సెప్ట్ ఇది, అది ఆపేయాలి