Allu Arjun: బింబిసారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శకుడుగా అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు వశిష్ట. అయితే వశిష్ట గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే వశిష్ట నాన్న సత్యనారాయణ రెడ్డి ఒక ప్రొడ్యూసర్. వివి వినాయక్ కి సత్యనారాయణ రెడ్డి కి మంచి అనుబంధం ఉంది. అల్లు అర్జున్ హీరోగా చేసిన బన్నీ సినిమాకు సత్యనారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఇక రీసెంట్ గా ఒక ఛానల్ కు నిర్మాత సత్యనారాయణ రెడ్డి ఇంటర్వ్యూ అని ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. అసలు ఆర్య సినిమా అల్లు అర్జున్ చేయడానికి వెనుక ఎంత కదు ఉందో ఆయన మాటల్లో వింటే ఆశ్చర్యం కలుగుతుంది.
ఆర్య వెనుక కథ
దిల్ సినిమా అయిపోయిన తర్వాత సుకుమార్ ను దర్శకుడుగా పరిచయం చేస్తూ సినిమాను చేయాలని నిర్ణయించుకున్నారు దిల్ రాజు. అప్పటికే సుకుమార్ రాసిన కథను చాలామంది హీరోలకు చెప్పారు. అందులో అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ కూడా కథను విన్నారు. కానీ ఎక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. దిల్ రాజు అప్పటికి నిర్మాతగా కేవలం ఒక సినిమాను మాత్రమే చేశారు కాబట్టి పెద్దగా ఆయనకు పాపులారిటీ కూడా లేదు. దిల్ రాజు ఆఫీస్ కి సత్యనారాయణ రెడ్డి వెళ్లారు. అయితే అక్కడ దిల్ రాజు తో మాట్లాడుతున్న సందర్భంలో ఒక మ్యాగజిన్ కనిపించింది. ఆ మ్యాగజిన్ పై గంగోత్రి సినిమాకు సంబంధించి వందరోజుల పోస్టర్ ఉంది. అయితే మీ సినిమాకు ఈ అబ్బాయిని పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పారట సత్యనారాయణరెడ్డి. ఆ మాటకు వాళ్లకు కూడా చెప్పాము గాని ఎటువంటి రెస్పాన్స్ రాలేదండి అంటూ చెప్పారు దిల్ రాజు.
అల్లు అరవింద్ ను ఒప్పించిన వశిష్ట ఫాదర్
అయితే అల్లు అరవింద్ కు సత్యనారాయణ రెడ్డి కు మధ్య ఒక బాండింగ్ ఉంది. అయితే ఈ కథ విషయమే మాట్లాడడానికి ఒకసారి కలుద్దాం అని చెప్పినప్పుడు వారిద్దరు కలిశారట. కథ చాలా బాగుంటుంది అబ్బాయిని దిల్ రాజు గారికి ఇచ్చేయండి అంటూ చెప్పుకొచ్చారు. కథను నేను విన్నానండి ఒక మూడు గంటలసేపు కథను చెప్పి ఇంటర్వ్యూలు అన్నాడు దర్శకుడు అని సుకుమార్ గురించి చెప్పారు. మొదటిసారి కదా కంగారు పడ్డారేమో కానీ మంచి టాలెంటెడ్ అండి అంటూ సుకుమార్ గురించి సత్యనారాయణ రెడ్డి అల్లు అరవింద్ కు చెప్పారట. ఆ తర్వాత అల్లు అర్జున్ ను దిల్ రాజు కు అప్పజెప్పడం ఆ తర్వాత ఆర్య సినిమా జరగడం జరిగింది. ఆర్య సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.
Also Read : Sampath Nandi : రామ్ చరణ్ తో రెండో సినిమా గురించి అడిగితే అలా మాట్లాడేసాడు ఏంటి.?