Nani: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో అప్పటి జనరేషన్ లో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ పేరు ఎలా వినిపిస్తుందో, ఇప్పుడు జనరేషన్ లో నాని పేరు అదే స్థాయిలో వినిపిస్తుంది. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలు పెట్టిన నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన అష్టా చమ్మా సినిమాతో నటుడుగా మారాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ సక్సెస్ సాధించింది. నటుడుగా కూడా నానికి మంచి అవకాశాలు తీసుకొచ్చింది. నాని కథలు ఎంచుకునే విధానం రీసెంట్ టైమ్స్ లో చాలామందిని ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. జెర్సీ సినిమా తర్వాత నాని స్క్రిప్ట్ సెలక్షన్ కంప్లీట్ గా మారిపోయింది. ఏ సినిమా చేసిన దానికంటూ ఒక ప్రత్యేకత ఉండేలాగా ప్లాన్ చేసుకొని కెరీర్ లో ముందుకు వెళుతున్నాడు. ఒకవైపు నటుడు గానే కాకుండా మరోవైపు నిర్మాతగా కూడా అడుగులు వేసి సక్సెస్ఫుల్ సినిమాలు అందిస్తున్నాడు.
స్టుపిడ్ కాన్సెప్ట్ ఆపేయాలి
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటించిన సినిమా దసరా. భారీ హైప్ తో రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ఫుల్గా అంచనాలను అందుకుంది. నానిని మునుపెన్నడూ చూడని విధంగా చూపించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించాడు దర్శకుడు శ్రీకాంత్. ఈ సినిమా తర్వాత నాని నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాడు. ఇప్పుడు నాని నుంచి ఒక ప్రాజెక్టు వస్తుంది అంటే ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూడొచ్చు. నాని కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చింది దసరా సినిమా. ఆ తర్వాత చేసిన హాయ్ నాన్న సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది. అయితే నాని 100 కోట్ల సినిమా రీచ్ అయిపోయాడు కాబట్టి టైర్ వన్ లోకి చేరిపోయాడు అని అనొచ్చా అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ నానిని ప్రశ్నించారు. నాని దీనికి స్పందిస్తూ ఇది ఎవరు కనిపెట్టారు గాని ఆపేయాలి. ఇది ఒక స్టుపిడ్ కాన్సెప్ట్ అంటూ చెప్పుకొచ్చారు.
అలా చేస్తేనే మంచి సినిమాలు వస్తాయి
అసలు నిజంగా చెబుతున్నాను నాకు ఈ కాన్సెప్ట్ తెలియదు బహుశా మన మీడియా జర్నలిస్టులే దీనిని సృష్టించి ఉంటారు. ఇలా చేయటం వలన ఏం జరుగుతుందంటే రైలు బోగీలను వేరు చేసినట్లు సినిమాను వేరు చేసినట్లు. అలాకాకుండా అన్ని ఒకేలా చూస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు బాగుంటారు, నేను బాగుంటాను మంచి సినిమాలు వస్తాయి అంటూ నాని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం నాని మాట్లాడుతున్న ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాని నటిస్తున్న హిట్ 3 సినిమా మే 1న విడుదల కానుంది. నిన్న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేస్తుంది.
Also Read : Aarti Gupta : ఎస్ కే ఎన్ మాటలతో దెబ్బకు తెలుగు నేర్చుకుంటున్న ముంబై నటి