BigTV English

Aditi Shankar: పాపం ఆ దర్శకుడిని బాడీగార్డ్ అని అనుకుంది

Aditi Shankar: పాపం ఆ దర్శకుడిని బాడీగార్డ్ అని అనుకుంది

Aditi Shankar: సినిమాల్లో కనిపిస్తారు కాబట్టి నటులకు మంచి గుర్తింపు ఉంటుంది కానీ టెక్నీషియన్స్ ని సినిమా మీద విపరీతమైన ఇష్టం ఉన్నవాళ్లు మాత్రమే గుర్తుపడతారు. అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువగా ఉంది కాబట్టి చాలామంది టెక్నీషియన్స్ ను ఈజీగా గుర్తు పడుతున్నారు. ఒకప్పుడు దర్శకులు పేర్లు కేవలం పోస్టర్ కు మాత్రమే పరిమితం అయ్యేవి. ఆ తర్వాత చాలామంది సినిమాలు మీద ఇష్టం పెంచుకొని ఇంత మంచి వర్క్ ఎవరు చేశారు అని ఆరాలు తీయడం మొదలుపెట్టేవారు. ఆ తర్వాత ఆయా దర్శకులు చేసిన పాత సినిమాలను కూడా చూస్తున్నారు. ఇకపోతే తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా మంచి పేరు సంపాదించుకున్న ఒక ప్రముఖ దర్శకుడుని హీరోయిన్ శంకర్ కూతురు తెలుసుకోలేకపోయారు.


అసలు ఏం జరిగింది.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా మహేష్ బాబుకి మంచి క్రేజ్ ఉంది. మహేష్ చేసిన ఎన్నో సినిమాలు విజయ్ రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. మహేష్ బాబు కూడా చిన్నప్పుడు నుంచి చెన్నైలోనే పెరిగారు. తమిళ్ కూడా అద్భుతంగా మాట్లాడుతారు. మహేష్ బాబు వి కొన్ని సినిమాలు తమిళ్ లో కూడా డబ్బింగ్ అయ్యాయి. ఆ రకంగా తమిళ్లో కూడా మహేష్ బాబుకి మంచి పేరు గుర్తింపు ఉన్నాయి. అయితే ఒకసారి హోటల్లో మహేష్ బాబు తన ఫ్యామిలీతో పాటు లంచ్ చేస్తున్నారు. ఆ తరుణంలో కొంతమంది వచ్చి మహేష్ బాబుని ఫోటోలు అడిగారు. అయితే ప్రస్తుతం ఫ్యామిలీతో ఉన్నాను అని మహేష్ చెప్పడంతో వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ప్రముఖ దర్శకులు శంకర్ కూతుర్లు. ఈ విషయం మహేష్ బాబుకి దర్శకుడు మెహర్ రమేష్ తెలిపారు. ఈ విషయాన్ని మహేష్ బాబు బాలకృష్ణతో జరిగిన అన్ స్టాపబుల్ షో లో చెప్పుకొచ్చారు.


దర్శకుడుని బాడీగార్డ్ అనుకున్నారు 

అయితే ఈ విషయం పైన అప్పట్లో మహేష్ బాబు మాట్లాడుతూ పిల్లల్ని చాలా బాగా పెంచారు అంటూ శంకర్ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని శంకర్ కూతురు అదితి శంకర్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. మహేష్ బాబుని ఫోటో అడిగాము ఫ్యామిలీతో ఉన్నాము అని చెప్పినప్పుడు మేము సారీ చెప్పాము. ఆ తరువాత వాళ్ళ బాడీగార్డ్ ఎవరో వచ్చారు శంకర్ సార్ డాటర్స్ అని చెప్పిన తర్వాత ఆయన వచ్చి మాట్లాడారు అంటూ తెలిపారు. అయితే వచ్చింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకుడు మెహర్ రమేష్ అని వాళ్లకు తెలియదు. మహేష్ బాబుకి మెహర్ రమేష్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే చాలా సందర్భాలలో మహేష్, రమేష్ కలిసి కనిపిస్తూ ఉంటారు. శంకర్ సార్ డాటర్స్ అనే విషయాన్ని రమేష్ చెప్పాడు అంటూ బాలకృష్ణతో మహేష్ బాబు కూడా ఆ షో లో తెలిపాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×