Kingdom Movie Release : రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) త్వరలోనే డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gautham Tinnanuri) దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం కింగ్ డమ్ (Kingdom). సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటి భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ముఖ్యంగా సినిమా నుంచి విడుదలైన టీజర్ భారీ స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వటం మరింత హైలెట్ గా నిలిచింది.
హరిహర వీరమల్లు…
ఇలా టీజర్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా జూలై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అధికారకంగా విడుదల తేదీన ప్రకటించారు. అయితే ఉన్నఫలంగా ఈ సినిమా విడుదలకు కొన్ని చిక్కులు వచ్చాయని తద్వారా ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల అవుతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. నిజానికి ఈ సినిమా జూన్ 4వ తేదీ విడుదల వాయిదా పడిందనే వార్తలు రావడానికి కారణం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా జూన్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా వేశారు.
వాయిదా ఆలోచన లేదు…
ఇలా జూన్ 12వ తేదీ ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో తిరిగి ఈ సినిమా జూన్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందుకే ఆరోజు విడుదల అయ్యే కింగ్ డమ్ సినిమా వాయిదా పడుతూ ఆగస్టు నెలలో విడుదలవుతుందని ఒక వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కెర్లులు కొడుతుంది. ఇక ఈ సినిమా వాయిదా గురించి చిత్ర బృందం ఎక్కడ స్పందించలేదు. అయితే ఈ సినిమా ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను రీ షూట్ జరుపుకుంటుందని వార్తలు బయటకు వచ్చాయి. విజయ్ దేవరకొండపై గోవాలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను తిరిగి చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
ఈ కారణాలవల్ల ఈ సినిమా జులై 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిర్మాత నాగ వంశీ స్పందించారు. మా కింగ్ డమ్ సినిమాని వాయిదా వేసుకోవాలని ఆలోచన మాకైతే లేదని తెలిపారు. ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తే మా సినిమాని వాయిదా వేసుకోవాలనే ఆలోచన ఉండవచ్చేమో కానీ ప్రస్తుతానికైతే వాయిదా వేసే ఆలోచన లేదని తెలిపారు. ఈ సినిమా నుంచి మరొక రెండు రోజులలో సాంగ్ కూడా విడుదల చేయబోతున్నామని, ఈ సినిమా విడుదల వాయిదా పడింది అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజం కాదని ఈయన క్లారిటీ ఇచ్చారు. అయితే గతంలో నాగ వంశీ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయితే ఆ సినిమాకు అడ్డు లేకుండా మేము తప్పుకుంటామని తెలిపారు. ఒకవేళ హరిహర వీరమల్లు కొత్త విడుదల తేదీకి ఈ సినిమా అడ్డంకి గా ఉంటే వాయిదా పడుతుంది లేదంటే అనుకున్న విధంగానే జులై 4వ తేదీని ఈ సినిమా విడుదల కానుందని స్పష్టమవుతుంది.