Director Srinu Vaitla: నీకోసం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. రవితేజ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధించి లేకపోయినా కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఇకపోతే ఆ తర్వాత శ్రీను వైట్ల చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించాయి. శ్రీను వైట్ల సినిమాలంటేనే కామెడీకి కేరాఫ్ అడ్రస్ లా అనిపిస్తాయి. శ్రీను వైట్ల హిట్ సినిమా చేసి చాలా ఏళ్లయింది అని చెప్పాలి. ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా తర్వాత ఇప్పటివరకు ప్రాపర్ హిట్ సినిమా శ్రీనువైట్ల చేయలేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ డిజాస్టర్ గానే మిగిలాయి. రీసెంట్ గా వచ్చిన విశ్వం సినిమా ఓకే అనిపించుకుంది.
ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికి దక్కని అవకాశం శ్రీను వైట్లకి దక్కింది. మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో కూడా శ్రీనువైట్ల పనిచేసారు. ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమాలు మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గాయి కానీ ఒకప్పుడు శ్రీను వైట్ల సినిమా అంటే మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అందరూ బిలీవ్ చేసి థియేటర్ కు వెళ్లేవాళ్ళు. మళ్లీ శ్రీనువైట్ల ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తే ఎలా ఉండబోతుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా వరకు మీమ్ కంటెంట్ శ్రీను వైట్ల సినిమాలలోది ఉంటుంది. రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన వెంకీ , దుబాయ్ శీను సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అప్పటికే వరుస సక్సెస్ మీద ఉన్న మైత్రి మూవీ మేకర్స్ కి కూడా ఈ సినిమా నిరాశను మిగిల్చింది.
Also Read: Daali Dhananjaya: ఘనంగా ‘పుష్ప’ నటుడి పెళ్లి.. మైసూరులో ఘనంగా వివాహ వేడుకలు
ఇక ప్రస్తుతం మళ్ళీ అదే బ్యానర్ లో శ్రీను వైట్ల సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ లో శ్రీను వైట్ల ఒక కథను చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఆ కథ చర్చలు సక్రమంగా జరిగి ప్రాజెక్టు పట్టాలెక్కితే మైత్రిలో మరోసారి శ్రీనువైట్లకి అవకాశం దొరికినట్లే. శ్రీను వైట్లని ఎవరు నమ్మని తరుణంలో మైత్రి మూవీ మేకర్స్ నమ్మి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను అప్పగించింది. ఇప్పుడు విశ్వం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న శ్రీనువైట్ల మరోసారి మైత్రి మెట్లు ఎక్కాడు. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా సాధించని విజయాన్ని ఇప్పుడు మళ్లీ మరో సినిమాతో మైత్రికి శ్రీనువైట్ల ఇస్తాడా.? అసలు ఏ హీరో ఇప్పుడు శ్రీను వైట్లతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని పలు రకాలు చర్చలు మొదలయ్యాయి. దీని గురించి అధికార ప్రతి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Sivakarthikeyan: సినిమాలు చేయించుకొని రెమ్యునరేషన్ ఇవ్వలేదు.. శివకార్తికేయన్ ఆవేదన