Sivakarthikeyan: బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో హీరోగా నిలబడడం చాలా పెద్ద విషయం. అంత కష్టపడినా కూడా అలాంటి హీరోలకు ఒక స్టేజ్ వచ్చే వరకు విలువ ఉండదు. వారిని చూసి ఎవరూ భయపడరు. వారి వెనుక ఎవరో ఉన్నారు అనే భయం మేకర్స్‌లో ఉండదు. ప్రస్తుతం కోలీవుడ్‌లో శివకార్తికేయన్ పరిస్థితి కూడా అలాగే ఉందా అనే అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా తను నటించిన ‘అమరన్’ మూవీ కోలీవుడ్‌లో మునుపెన్నడూ లేని రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా తమిళనాడులోని పలు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ‘అమరన్’ మూవీ 100 డేస్ ఫంక్షన్‌లో శివకార్తికేయన్ మాట్లాడిన మాటలు తాజాగా వైరల్ అవుతున్నాయి.
ఆరు నెలల ముందే
అసలు కోలీవుడ్‌లో రెమ్యునరేషన్ పద్ధతి ఎలా ఉంటుందా అనే విషయంపై ‘అమరన్’ 100 డేస్ ఫంక్షన్‌లో శివకార్తికేయన్ బయటపెట్టాడు. మామూలుగా ఒక సినిమా విడుదలయ్యే వరకు కూడా కొందరు మేకర్స్ రెమ్యునరేషన్ ఇవ్వరని కానీ తనకు ‘అమరన్’ విషయంలో అలా జరగలేదని చెప్పుకొచ్చాడు. ‘‘నేను నటించిన కొన్ని సినిమాలకు విడుదల ముందు రోజు వరకు రెమ్యునరేషన్ ఇస్తారేమో అని ఎదరుచూశాను. కానీ అమరన్ విడుదలయ్యే ఆరు నెలల ముందే రాజ్ కమర్ ఫిల్మ్స్ నాకు మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చేశారు. నటీనటులను గౌరవిస్తూ కంపెనీ నడపడం అనేది చాలా పెద్ద విషయం’’ అని తెలిపాడు శివకార్తికేయన్.
యాక్టివ్‌గా కమల్
‘అమరన్’ (Amaran) సినిమాలో శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయి పల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటించగా.. దానిని భారీ బడ్జెట్‌తో నిర్మించారు కమల్ హాసన్. తన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కింది. అందుకే హీరోహీరోయిన్లతో కలిసి కమల్ హాసన్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ 100 డేస్ ఈవెంట్‌లో కూడా శివకార్తికేయన్‌తో పాటు కమల్ హాసన్ కూడా పాల్గొన్నారు. అంతే కాకుండా మీడియా లోపలికి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఈ ఈవెంట్‌పై విమర్శలు కూడా వచ్చాయి. అయినా కూడా ‘అమరన్’ టీమ్ మాత్రం వారి సక్సెస్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. వారి ఫ్యాన్స్ కూడా ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: తల్లి ఇచ్చిన చీరే తన పెళ్లిలో ప్రత్యేకమంటున్న సాయి పల్లవి.. ప్రత్యేకత ఏంటంటే ?
చాలా డెడికేటెడ్
‘అమరన్’ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా శివకార్తికేయన్‌కే ఇచ్చేశారు కమల్ హాసన్ (Kamal Haasan). యాక్టింగ్ విషయంలోనే కాకుండా తను ప్రతీ విషయంలో డెడికేటెడ్‌గా ఉంటాడని ప్రశంసించారు. సొంతిల్లు కట్టుకున్న తర్వాత తనకు సినిమాల నుండి వచ్చే డబ్బును మొత్తం సినిమాల్లోనే పెట్టుబడి పెడుతున్నాడని శివకార్తికేయన్ గురించి బయటపెట్టారు కమల్. ‘అమరన్’ సినిమాలో శివకార్తికేయన్‌కు ఎంత గుర్తింపు లభించిందో సాయి పల్లవికి కూడా అంతే గుర్తింపు లభించింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’ మూవీ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్ట్ చేసి హిట్ కొట్టింది.