Brahmanandam..బ్రహ్మానందం (Brahmanandam).. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆయన చేసే కామెడీ కంటే ఆయన పేరు చెబితేనే ముఖంలో నవ్వు విరబూస్తుంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రోత్సాహంతోనే అవకాశాన్ని అందుకొని భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. సినీ కెరియర్ లోనే 1200కు పైగా చిత్రాలలో కమెడియన్ గా నటించి, గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. ఇకపోతే బ్రహ్మానందం తన కామెడీతో నవ్వించడమే కాదు తన నటనతో ఏడిపించగలరు కూడా.. దీనికి ఉదాహరణ ‘బాబాయ్ హోటల్’.. ఆ తరువాత ఈ మధ్యకాలంలో వచ్చిన ‘రంగమార్తాండ’ చిత్రాలు ఆయనలోని మరో నటుడిని నిద్రలేపాయి. అయితే ఇప్పుడు బ్రహ్మానందం తన కొడుకుతో కలిసిన నటించిన ‘బ్రహ్మ ఆనందం’లో ఉన్న మరో యాంగిల్ ను చూసి అభిమానులు సైతం కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటనకి ఇచ్చే ప్రాముఖ్యతను చూసి హాస్యబ్రహ్మ అందుకే అవ్వలేదు. ఆయన లెజెండ్రీ యాక్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అలా చేశారు కాబట్టే గ్రేట్ యాక్టర్ అయ్యారు..
ఇకపోతే చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం తన కొడుకు గౌతమ్ రాజా (Gautham Raja) తో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమా చేశారు. ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. రంగమార్తాండ సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనను బ్రహ్మానందం పెద్ద కుమారుడు గౌతమ్ రాజాగా మీడియా ఈవెంట్లో మాట్లాడుతూ.. బ్రహ్మానందం నటనా విషయంలో ఎంత డెడికేటెడ్ గా ఉంటారో మరోసారి నిరూపించారు. ఈ నేపథ్యంలోనే.. గౌతమ్ రాజా మాట్లాడుతూ..” మా నాన్న నాకు నటుడిగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే రంగమార్తాండ సినిమాలో ఒక సన్నివేశంలో భార్య చనిపోతే ఏడ్చే సన్నివేశం ఉంటుంది. రోజు భోజనానికి ఇంటికి వచ్చే ఆయన.. మా ఇంటికి తినడానికి రాలేదు. అమ్మని అడిగితే ఏమో తినను అని చెప్తారు అని నాతో చెప్పింది. ఇక నేను వెళ్లి నాన్నను ఎందుకు తినట్లేదు అని అడిగితే.. రేపు షూటింగ్లో ఒక సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో చాలా వీక్ గా నేను కనబడాలి. ఇవాళ అంతా తినకపోతే రేపు ఆ నీరసం అనేది ముఖంలో కనిపిస్తే.. ఆ సీన్ ఇంకా ఎలివేట్ అవుతుంది కదా.. అందుకే తినలేదు అంటూ చెప్పారు” అని గౌతమ్ రాజా తెలిపారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఆయన ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వయసులో కూడా నటన కోసం అంత కష్టపడుతున్నారు అంటే ఇక నటన కోసం ఆయన ఎంత డెడికేటెడ్ గా పనిచేస్తున్నారో అర్థమవుతుంది అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
గౌతమ్ రాజా కెరియర్..
గౌతమ్ రాజా విషయానికి వస్తే.. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా.. పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఇప్పుడు చాలాకాలం తర్వాత తన తండ్రితో కలిసి ‘బ్రహ్మ ఆనందం’ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో గౌతమ్ రాజాకు ఇండస్ట్రీలో మళ్ళీ వరుస అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి మునుముందు ఆయన సినిమా భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.