BigTV English

Kissik Song : సాంగ్ లో సుక్కు… డైరెక్టర్ గారి దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా…

Kissik Song : సాంగ్ లో సుక్కు… డైరెక్టర్ గారి దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందా…

Kissik Song : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 మేనియా కొనసాగుతుంది. మరి కొద్దిరోజుల్లో సినిమా థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకోవడమే కాదు మూవీ పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. దాంతో పుష్ప 2 కోసం ఫ్యాన్స్ తో పాటుగా సినీ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే రెండు బ్లాక్ బస్టర్ ఈవెంట్లు నిర్వహించారు. పాట్నాలో నిర్వహించిన ఈవెంట్ కు దేశ వ్యాప్తంగా హైప్ వచ్చింది. ఇక చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ కూడా భారీగానే సక్సెస్ అయింది. దీంతో పుష్ప ఫీవర్ మొత్తం పాకేసింది. ఈ సినిమాతో కచ్చితంగా బన్నీ పాన్ ఇండియాలో క్రేజ్ ను అందుకుంటుందని భావిస్తున్నారు మూవీ మేకర్స్. ఇక రిలీజ్ డేట్ దగ్గరకు రావడంతో రోజుకో అప్ డేట్ ఇస్తున్నారు. తాజాగా మూవీ సెన్సార్ టాక్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ డైరెక్టర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక నెట్టింట చక్కర్లు కొడుతుంది..


రీసెంట్ గా ఈ మూవీ నుంచి మూడో పాటగా ఐటమ్ సాంగ్ కిస్సిక్ పాటను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ 24 గంటల్లోనే ఏకంగా 42 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చినట్టు పోస్టు చేశారు మైత్రీ మూవీ మేకర్స్. యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. దాంతో ఈ పోస్టు కాస్త వైరల్ అవుతోంది. ఈ పాట కూడా చాలా మత్తుగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. శ్రీలీల ఈ సాంగ్ లో అదాలను ఓ రేంజ్ లోనే ఆరబోసిందని ఇప్పటికే వచ్చిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.. ఇక ఈ సాంగ్ లో డైరెక్టర్ సుకుమార్ ఉన్నాడని ఓ వార్త మీడియాలో వినిపిస్తుంది. ఏంటి సుకుమార్ డ్యాన్స్ చేశాడా? శ్రీలీల తో ఎవరికైనా డ్యాన్స్ చెయ్యాల్సిందే అనే కామెంట్స్ చేస్తున్నారు.

అక్కడే పప్పులో కాలేశారు.. డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాలో నటించలేదు. ఐటమ్ సాంగ్ లో తన గొంతు వినిపించాడట.. సాంగ్ స్టార్టింగ్ లో పార్టీకి రెడీగా ఉండండి. అందరు వచ్చారు అని ఒక మేల్ వాయిస్ వినిపిస్తుంది. ఆ లైన్ పాడింది ఎవరో సింగర్ కాదు మన సుక్కునే అట.. నమ్మలేకున్నారుగా కానీ ఇదే నిజం. ఇవే కాదు తాను డైరెక్టర్ చేసిన సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లలో ఆయన గొంతు వినిపిస్తుంది.. రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాటలో ఇంట్రో పాడింది కూడా సుక్కునే అట. ఈ వార్త విన్న ఆయన ఫ్యాన్స్ ఏంటి సుక్కు ఇదంతా నిజమా… నీలో ఈ టాలెంట్ కూడా ఉందా అని కామెంట్స్ చేస్తున్నారు. ఒక డైరెక్టర్ సింగర్ గా రాణించడం గ్రేట్ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక పుష్ప 2 విషయానికొస్తే.. డిసెంబర్ 5న రిలీజ్ చేస్తున్నారు. ఇందుకోసం భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి. వరుసగా ఈవెంట్లతో ప్రమోషన్ల జోరును పెంచుతున్నారు మూవీ మేకర్స్.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×