Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను అందుకుంది. ఒక్కో సినిమాలో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా క్రష్ అయ్యింది. రష్మిక మందన్నా హీరోయిన్ గా ఇపుడు ఒక్క తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళ భాషల్లోనూ దున్నేస్తున్నారు. ఇలా సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో అత్యంత వేగంగా సెటిల్ అయ్యిన టాప్ హీరోయిన్ గా నిలిచింది.. ఒకవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందో తెలుసుకుందాం..
రష్మికకు ఎన్ని హిట్ సినిమాల్లో నటించిన కూడా పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ను అందించింది మాత్రం పుష్ప మూవీనే.. అందులో నో డౌట్.. ఈ సినిమా విజయంతోనే రష్మిక భారీ స్టార్‌డమ్‌తో పాటుగా నేషనల్ క్రష్ అన్న ట్యాగ్ కూడా తెచ్చుకుంది. ఇక ఈ బిగ్గెస్ట్ సినిమాకి సీక్వెల్‌గా పుష్ప పార్ట్ 2 షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుని, డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్, డబ్బింగ్ ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సందర్బంగా రష్మిక మందన్న ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది. తన ఏడేళ్ల కెరీర్ లో ఒక్క పుష్ప సినిమా జర్నీనే మొత్తం ఐదేళ్లు ఉందని పేర్కొంది. ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకమని.. ఒక రకంగా పుష్ప జర్నీ అనేది తనకు ఒక ఇల్లులా మారిపోయింది అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది..
ఈ సినిమాలో తనతో పాటు పని చేసిన ప్రతీ ఒక్కరినీ ఎంతో మిస్ అవుతానని రష్మిక తెలిపింది. నా హృదయం ముక్కలైందంటూ ఓ నోట్ లో రాసుకొచ్చింది. ఐదేళ్లలో చాలా వర్క్ చేసామని.. ఇంకా కొంచెం బ్యాలన్స్ ఉంది అంటూ పనిలో పనిగా పుష్ప పార్ట్ 3 పై కూడా ఆమె హింట్ ఇచ్చారు. అలాగే అల్లు అర్జున్ సర్, సుకుమార్ గారు ఇంకా ఈ సినిమా సమయంలో తనకు బాగా క్లోజ్ అయ్యారని రష్మిక తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అందరిని విడిచి వెళ్లాలంటే బాధగా ఉందని ఆమె ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఆ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక దాదాపు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న పుష్ప 2 తాజాగా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందే మంచి టాక్ ను అందుకుంది. ఇక రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను కైవసం చేసుకుంటుందో చూడాలి..