BigTV English

Congress: 9 ఏళ్లు.. 9 ప్రశ్నలు.. మోదీ పాలనపై కాంగ్రెస్ చురుక్కులు..

Congress: 9 ఏళ్లు.. 9 ప్రశ్నలు.. మోదీ పాలనపై కాంగ్రెస్ చురుక్కులు..
9 saal 9 sawaal

Congress: మోదీ ప్రధానిగా మారి సరిగ్గా 9 ఏళ్లు. పండుగలా జరుపుకుంటోంది బీజేపీ. కాంగ్రెస్ మాత్రం ప్రశ్నలతో కుళ్లబొడుస్తోంది. ఇన్నేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నందుకు ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. ‘నౌ సాల్‌.. నౌ సవాల్‌’ పేరుతో బుక్‌లెట్‌ రిలీజ్ చేసింది. మే 26ను కేంద్ర ప్రభుత్వం ‘మాఫీ దివస్‌’గా నిర్వహించాలని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.


మోదీకి కాంగ్రెస్‌ సంధించిన 9 ప్రశ్నలు:

ప్రశ్న 1: ఆర్థిక వ్యవస్థ
ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతోంది? ధనవంతులు మరింత ధనవంతులుగా.. పేదవారు మరింత పేదవారుగా ఎందుకు మారుతున్నారు? ప్రధాని స్నేహితులకు ప్రభుత్వ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారు?


ప్రశ్న 2: వ్యవసాయం, రైతులు
రైతులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయ్యలేదు? మద్ధతు ధరకు ఎందుకు చట్టబద్ధత కల్పించలేదు? 9 ఏళ్ల పాలనలో రైతుల ఆదాయం ఎందుకు రెట్టింపు కాలేదు?

ప్రశ్న 3: అవినీతి
అదానీకి లబ్ధి చేకూర్చడానికి LIC, SBIలను ఎందుకు నాశనం చేస్తున్నారు? దొంగలు దేశం విడిచి పోతుంటే ఎందుకు ఊరుకుంటున్నారు?
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతిపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?

ప్రశ్న 4: చైనా, జాతీయ భద్రతా
2020లో చైనాకు క్లీన్‌చిట్‌ ఇచ్చాక కూడా భారత్‌లోని ప్రాంతాలు ఎందుకు ఆక్రమణకు గురవుతున్నాయి? 18 సమావేశాలు జరిగిన తర్వాత కూడా చైనా బలగాలు భారత్‌ ప్రాంతాల్లోనే ఎందుకు తిష్ట వేశాయి? వారి వ్యూహాల అమలులోనే ఇంకా చైనా బలగాలు ఎందుకు ఉన్నాయి?

ప్రశ్న 5: సామాజిక సామరస్యం
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి విద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? సమాజంలో భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారు?

ప్రశ్న 6: సామాజిక న్యాయం
సామాజిక న్యాయాన్ని ఓ పద్ధతి ప్రకారం ఎందుకు నాశనం చేస్తున్నారు? మహిళ, దళిత, బడుగు వర్గాలపై జరుగుతున్న అరాచకాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? కుల గణనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

ప్రశ్న 7: ప్రజాస్వామ్యం, ఫెడరలిజం
9 ఏళ్లలో రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎందుకు బలహీనపరిచారు? విపక్ష పార్టీలు, నేతలపై కక్ష తీర్చుకునే ధోరణిని ఎందుకు అవలంబిస్తున్నారు? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ధనబలంతో ఎందుకు కూల్చేస్తున్నారు?

ప్రశ్న 8: సంక్షేమ పథకాలు
బడ్జెట్‌లో నిధుల కోత విధించి, పేదలకు అందించే సంక్షేమ పథకాలకు బడ్జెట్‌ను తగ్గించి, కఠిన నిబంధనలు తీసుకొచ్చి వాటిని ఎందుకు బలహీనపరుస్తున్నారు?

ప్రశ్న 9: కొవిడ్‌-19 నియంత్రణలో వైఫల్యం
40 లక్షల మంది కొవిడ్‌తో మరణిస్తే వారి కుటుంబాలకు చేసిందేంటి? ఎందుకు అంత అత్యవసరంగా లాక్‌డౌన్ విధించారు? ఎలాంటి సదుపాయాలు లేకుండా లక్షలాది మంది వర్కర్లను ఇళ్లకు వెళ్లమని ఎందుకు చెప్పారు?

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×