V.V.Vinayak:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని కుటుంబం (Akkineni Family) నుండి వారసుడిగా అడుగుపెట్టిన హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil). ‘అఖిల్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈయన.. ఈ సినిమా ఫ్లాప్ పై దర్శకుడు వి. వి.వినాయక్ (VV Vinayak) స్పందించారు. పరాజయానికి కారణాలు చెప్పడమే కాకుండా మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. అఖిల్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఆరు సినిమాలు చేయగా.. ఆరు కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం గమనార్హం. అయితే ఆయన కెరీర్ కి ఒక్క సినిమా కూడా విజయాన్ని అందించలేదు. ప్రస్తుతం ‘లెనిన్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాపై ఒక వర్గం ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
అఖిల్ మూవీ ఫ్లాప్.. అప్పుచేసి బయ్యర్లకు సెటిల్ చేసిన డైరెక్టర్..
ఇదిలా ఉండగా అఖిల్ కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ (VV.Vinayak ) అఖిల్ సినిమా గురించి షాకింగ్ విషయాలు తెలిపారు. అఖిల్ హీరోగా.. అఖిల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో యాక్షన్ ఫాంటసీగా వచ్చిన ఈ సినిమాలో సాయేషా (Sayyesha ) హీరోయిన్ గా నటించింది. 2015 లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ మిగిల్చింది. ఈ విషయాన్ని డైరెక్టర్ వి.వి.వినాయక్ ఒప్పుకున్నారు. ఈ సినిమాతో బాగా నష్టపోయినట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. ఈ సినిమా స్టార్టింగ్ లోనే హైప్ బాగా వచ్చింది. కానీ ఫలితం మాత్రం తేడా కొట్టింది. ఈ క్రమంలోనే కొంతమంది బయ్యర్లకు నేనే డబ్బులు ఇచ్చి మరీ సెటిల్ చేయాల్సి వచ్చింది.చాలా పెద్ద అమౌంట్ ని ఒక పెద్దమనిషి దగ్గర తెచ్చి.. బయ్యర్లకి బ్యాక్ చేశాను అంటూ వి.వి.వినాయక్ తెలిపారు. మొత్తానికైతే ఒక పెద్ద మనిషి అంటున్నారు అంటే కోట్ల రూపాయల్లోనే వివి వినాయక్ సెటిల్ చేసి ఉంటారని తెలుస్తోంది.
అఖిల్ విషయంలో ఇప్పటికీ ఆ బాధ ఉంది – డైరెక్టర్ వి.వి. వినాయక్.
అయితే ఇప్పటికీ అఖిల్ విషయంలో తనకు బాధగానే ఉందని, ఎంతో ఇష్టపడి తనతో సినిమా చేసిన అఖిల్ కి హిట్ ఇవ్వలేకపోయాను అనే బాధ ఇప్పటికీ ఉందని, ప్రతిరోజు ఈ విషయంపై బాధపడుతూ ఉంటానని తెలిపారు వివి వినాయక్. అఖిల్ కి మంచి గిఫ్ట్ ఇవ్వలేకపోయినా అఖిల్ తో ఇప్పటికీ తనకు మంచి ర్యాపో ఉందని, ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని కూడా తెలిపారు డైరెక్టర్ వివి వినాయక్.
అఖిల్ ఫ్లాప్ పై డైరెక్టర్ ఊహించని కామెంట్స్..
అఖిల్ సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కథ అఖిల్ కి పెద్దదైపోయింది. తను మోయగలిగినంత కాకుండా ఎక్కువ బరువు పెట్టాము. అత్యాశకు పోయాము. కథ ఒక సమస్య అయితే.. సీజీ కూడా కంప్లీట్ కాక ఇబ్బంది పడ్డాము. కరెక్ట్ విడుదల అయ్యే టైంకి సినిమాని కూడా చూడలేకపోయాము. ఎప్పటికైనా అఖిల్ పెద్ద సూపర్ స్టార్ అవుతారు. ఆ నమ్మకం నాకుంది. అంటూ వి.వి.వినాయక్ తెలిపారు.