BigTV English

Mahesh Babu : 5 కోట్ల స్కాం.. నేడు విచారణకు మహేష్ బాబు… ఈ సారి కూడా డుమ్మా..?

Mahesh Babu : 5 కోట్ల స్కాం.. నేడు విచారణకు మహేష్ బాబు… ఈ సారి కూడా డుమ్మా..?

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇటీవల ఈడీ అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.. సాయి సూర్య డెవలపర్స్ గ్రూప్ వ్యవహారంలో మహేష్ బాబుకు ఈడి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. గత వారం రోజుల కిందట సాయి సూర్య డెవలపర్స్ గ్రూపులో నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా భారీ లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారట. సాయి సూర్య డెవలపర్స్ నుంచి దాదాపు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారని అధికారులు గుర్తించారు. మహేష్ బాబు కి నోటీసులు పంపించారు. గత నెల 28న ఈ విచారణకు మహేష్ బాబు హాజరు కావాల్సి ఉంది.. కానీ షూటింగ్ కారణంగా ఆయన రాలేకపోవడంతో నేడు ఆయన విచారణకు హాజరుకానున్నారని తెలుస్తుంది.. మరికొద్ది సేపట్లో మహేష్ బాబు అధికారుల ముందుకు విచారణ కానున్నారు.. దీని గురించి పూర్తి వివరాలు మరికొన్ని నిమిషాల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి..


సాయి సూర్య డెవలపర్స్ గ్రూపు కంపెనీలో సోదాలు..

ప్రముఖ కంపెనీలు అయిన సురానా సాయి సూర్య డెవలపర్స్‌ సంస్థలపై దాడులు చేశారు. సోదాల్లో భాగంగా సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ, సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీశ్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు.. ఈ కంపెనీలకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన సతీష్ అనే వ్యక్తిని గత కొద్ది రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. వెంచర్ పేరుతో డబ్బులను వసూలు చేశారని ఆయన పై ఆరోపణలు రావడంతో పోలీసులు అతని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు..


Also Read :5 కోట్ల స్కాం.. నేడు విచారణకు మహేష్ బాబు… ఈ సారి కూడా డుమ్మా..?

మహేష్ బాబుకు నోటీసులు.. 

ఈ కంపెనీలు అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధుల బదిలీలు చేసినట్లుగా విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు తేల్చారు. సాయిసూర్య డెవలపర్స్ హైదరాబాద్‌లో పలు కంపెనీలకు అక్రమంగా భూములను అమ్మినట్లు తేలడంతో.. ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు మైనింగ్, కాపర్, సోలార్ వ్యాపారాల్లో ఉన్న సురానా గ్రూప్స్ పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్‌ ఎస్టేట్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు పవర్‌ సెక్టార్‌లలో సురానా గ్రూప్‌ పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ రెండు కంపెనీలకు ప్రమెషన్ చేసిన సూపర్ స్టార్‌ మహేశ్ బాబుకు ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. అయితే గత నెల 28 న హాజరు కావాలని అధికారులు కోరారు. కానీ షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు మాత్రం రాలేనని చెప్పారు. అయితే నేడు ఆయన ఈడీ విచారణకు కాబోతున్నారు. మరి మహేష్ బాబు ఏం చెప్తారో చూడాలి..

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×