Yellamma movie Update :ఎల్దండి వేణు (Yeldandi Venu).. జబర్దస్త్ (Jabardast) కార్యక్రమం ద్వారా కమెడియన్ గా కెరియర్ మొదలుపెట్టిన వేణు, ఆ తర్వాత సినిమాలలో అవకాశం దక్కించుకున్నారు. అక్కడ స్టార్ హీరోల సినిమాలలో కూడా కామెడీ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన వేణు.. తనలోని టాలెంట్ ను నిరూపించుకోవడానికి దర్శకుడిగా మారారు. అలా తెలంగాణ నేపథ్యంలో పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో ‘బలగం’ అనే సినిమా చేసి దర్శకుడిగా సత్తా చాటారు. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు పలు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇప్పుడు ఎల్లమ్మ (Yellamma) అనే టైటిల్ తో మరో సినిమా చేస్తున్నారు వేణు.
ఎల్లమ్మ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చిన వేణు..
ఈ సినిమా ప్రకటించి చాలా రోజులే అయింది కానీ ఇప్పటివరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇకపోతే దిల్ రాజు(Dilraju ) నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదట నాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తారని ప్రచారం జోరుగా సాగింది. అటు నాని కూడా వేణుతో సినిమా చేస్తానని మాట ఇచ్చారు. దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తోందని అంతా ఫిక్సయ్యారు. కానీ ఏమైందో తెలియదు కానీ నాని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో.. కథ ఫైనల్ గా నితిన్ (Nithin )దగ్గరకు చేరింది. అటు వేణు చెప్పిన స్టోరీ నితిన్ కి బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పి డేట్స్ కూడా అరేంజ్ చేసుకున్నాడు. నిర్మాత దిల్ రాజు కూడా సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. కానీ సినిమా నుంచి మళ్లీ ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అయితే ఇన్ని రోజుల తర్వాత వేణు కూడా తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో ఎల్లమ్మ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. “ఫైనల్ స్క్రిప్ట్ పూర్తయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రాబోతోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాము” అంటూ హనుమాన్ మాలలో ఉన్న వేణు.. ఎల్లమ్మ సినిమా స్క్రిప్ట్ పుస్తకాన్ని ముందర పెట్టుకొని మరీ సెల్ఫీ ఫోటో షేర్ చేశాడు. ఇక మొత్తానికి అయితే స్క్రిప్ట్ మొత్తం పూర్తయిపోయింది. ఇక షూటింగ్ ప్రారంభం అవ్వడమే తరువాయి. ఇక ఈ విషయం తెలిసే అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. బలగం సినిమాతో పేరు తో పాటూ ఫ్యాన్స్ ను కూడా సొంతం చేసుకున్న వేణు తదుపరి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఎట్టకేలకు స్క్రిప్ట్ పూర్తయిందని సాలిడ్ అప్డేట్ వదిలారు మరి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తారో చూడాలి.
also read:HBD Jr NTR : దేవర తర్వాత విపరీతంగా పెరిగిన ఎన్టీఆర్ ఆస్తులు… ఇప్పుడు ఎన్ని కోట్లకు అధిపతి అంటే..?
ఎల్లమ్మ కోసం వేట మొదలుపెట్టిన టీమ్..
ఇకపోతే వేణు తయారుచేసిన ఈ కథ మొత్తం హీరోయిన్ పాత్ర చుట్టూనే తిరుగుతుందట. ఇక అంత పవర్ఫుల్ పాత్ర కోసం సాయి పల్లవి (Sai Pallavi) న్యాయం చేస్తుందని ఆమెను సంప్రదించగా.. డేట్స్ కాళీ లేక ఆమె నో చెప్పిందట. అటు కీర్తి సురేష్ (Keerthy Suresh) ని కూడా సంప్రదించారు. ఆమెకు కథ నచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆమె కూడా తప్పుకుంది. దీంతో శ్రీలీల (Sreeleela) ను రంగంలోకి దింపుదాము అనుకుంటే ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు రాగా.. రెండు కూడా ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో శ్రీ లీలను తీసుకోవడంలో కాస్త వెనకడుగు వేశారు మేకర్స్. ఇక కొత్త హీరోయిన్లను తీసుకునే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇక కథకు అనుకున్నట్టుగా ఎల్లమ్మ దొరికిన వెంటనే సినిమా స్టార్ట్ చేయబోతారని చెప్పవచ్చు.
Jai hanuman 🙏🙏#jaihanuman #yellamma #cinema #dreams #culture pic.twitter.com/xoVEK7XHw9
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) May 20, 2025