BigTV English

HBD Jr NTR : దేవర తర్వాత విపరీతంగా పెరిగిన ఎన్టీఆర్ ఆస్తులు… ఇప్పుడు ఎన్ని కోట్లకు అధిపతి అంటే..?

HBD Jr NTR : దేవర తర్వాత విపరీతంగా పెరిగిన ఎన్టీఆర్ ఆస్తులు… ఇప్పుడు ఎన్ని కోట్లకు అధిపతి అంటే..?

HBD Jr NTR : స్వర్గీయ నందమూరి తారకరామారావు (NT Ramarao) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. బాల నటుడిగా తన తాత ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో నటించారు. కానీ అది విడుదలకు నోచుకోలేదు. ఇక అంతకు ముందు గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో ‘బాల రామాయణం’ సినిమాలో తాతయ్య ఒడిలోనే నటనలో ఓనమాలు నేర్చుకొని నటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు గానూ విమర్శకుల ప్రశంసలు లభించాయి. కూచిపూడి డాన్స్ నేర్చుకున్న ఈయన దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలలో ప్రదర్శనలు కూడా ఇచ్చారు.


అయితే పెద్దల కోరిక మేరకు చదువుపై దృష్టి పెట్టి, ఆ తర్వాత ‘నిన్ను చూడాలని’ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన ఎన్టీఆర్.. తన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇకపోతే తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న ఎన్టీఆర్ దేవర (Devara) సినిమా తర్వాత అనూహ్యంగా రెమ్యూనరేషన్ తో పాటు ఆస్తులు కూడా పెంచేసుకున్నారని చెప్పాలి. నటుడు గానే కాకుండా ‘బిగ్ బాస్’ వంటి కార్యక్రమానికి హోస్ట్ గా చేసిన ఈయన ‘ మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి కూడా హోస్ట్‌గా వ్యవహరించారు. అంతేకాదు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగా సంపాదించారు ఎన్టీఆర్. ఈ రోజు ఆయన పుట్టినరోజు కావడంతో ఆయన రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పుడు పెరిగిన ఆస్తులు ఎంత? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన ఎన్టీఆర్..


నిన్ను చూడాలని అనే సినిమాతో మొదలైన ఈయన ప్రయాణం ‘స్టూడెంట్ నెంబర్ వన్’, ‘సింహాద్రి’, ‘ఆది’ సినిమాతో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ అందుకున్నారు. అయితే ఈ జోరును ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. మధ్యలో వరుసగా ఫ్లాప్ లు పడ్డాయి. దాంతో దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) రంగంలోకి దిగి తన దర్శకత్వంలో ‘యమదొంగ’ సినిమా చేసి ఎన్టీఆర్ కి మళ్లీ లైఫ్ ఇచ్చారు. ఆ వెంటనే ‘అదుర్స్’, ‘బృందావనం’ వంటి ఫ్యామిలీ చిత్రాలతో కూడా ఆకట్టుకున్నారు.

పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమాతో తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసిన ఈయన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘ జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి సినిమాలతో తిరుగులేదని నిరూపించుకున్నారు. ఈ సినిమాతో గ్లోబల్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈయన,ఆ తర్వాత కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో దేవర సినిమా చేసి అప్పటి వరకు ఉన్న రాజమౌళి సెంటిమెంట్‌ను కూడా బ్రేక్ చేశారు.

రాజమౌళితో సినిమా చేశాక ప్రతి హీరోకి ఫ్లాప్ వస్తుందనే సెంటిమెంట్ ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారు. ఈ సినిమా మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకొని సైలెంట్ గా 600 కోట్ల క్లబ్లో చేరిపోయింది. అలా దేవర సినిమా కోసం రూ.60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం ఏకంగా రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు హిందీలో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ -2 సినిమాతో హిందీలో అరంగేట్రం చేస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా కోసం సుమారుగా రూ.50 నుండి రూ.60 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ ఆస్తుల విలువ..

ఇక దేవర సినిమా తర్వాత రెమ్యూనరేషన్ తో పాటు ఆస్తులు కూడా పెరిగిపోయాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో విలాసవంతమైన ఇల్లు ఉంది. దాని విలువ సుమారుగా రూ.100 కోట్ల వరకు ఉంటుంది. హైదరాబాదులో శంకర్పల్లి లో ఒక ఫామ్ హౌస్ కూడా ఉంది. దీనికి ‘బృందావనం’ అని పేరు పెట్టినట్లు సమాచారం. ఇవే కాకుండా బెంగళూరులో కూడా ఒక ఇల్లు ఉంది. వీటితో పాటు పలు వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లో కూడా కోట్లల్లో పెట్టుబడులు పెట్టారు.

ఇక ఈయన దగ్గర ఉన్న కార్ల విషయానికి వస్తే.. రూ.కోటిన్నర విలువైన పోర్సే 911, రూ .2.5 కోట్ల విలువైన రేంజ్ రోవర్, రూ.1.5 కోట్ల విలువైన బెంజ్ ఫోర్ మెటిక్ కారు ఉంది. వీటితో పాటు రూ.కోట్ల విలువైన వాచ్లు కూడా ఈయన సొంతం. ఇక సోషల్ మీడియాలో అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఆస్తులు విలువ ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైమాటే. మొత్తానికి అయితే దేవర తర్వాత భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.

ALSO READ:HBD Jr NTR: కష్టాల నడుమే పెరిగాను.. అమ్మ బయటకు రాకపోవడానికి కారణం అదే.. ఎన్టీఆర్!

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×