Rohit Sharma : ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ( Rohit Sharma) తన మాట నిలబెట్టుకున్నాడు. ముందుగా ప్రకటించినట్లుగానే తన అభిమానికి.. నాలుగు కోట్ల కారు బహుమతిగా… ఇచ్చేశాడు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 Tournament ) ప్రారంభంలో ఒక యాడ్లో… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశాడు. తన లంబోర్గిని ఉరుస్ ( 2024 Lamborghini Urus ) బ్లూ కలర్ కారును విజేతకు ఇస్తానని… రోహిత్ శర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఐపిఎల్ ముగుస్తున్న నేపథ్యంలో ఆ పోటీలో గెలిచిన తన అభిమానికి కారును గిఫ్టుగా ఇచ్చాడు. ఈ సందర్భంగా విన్నర్ ఫ్యామిలీతో ఫోటోలు కూడా దిగాడు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆ కారును గెలుచుకుంది… రోహిత్ శర్మ వీరాభిమాని కావడం విశేషం. ముందుగా యాడ్లో చెప్పినట్లుగానే తన బ్లూ గిఫ్ట్ గా ఇచ్చి.. విజేతను సర్ప్రైజ్ చేశాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Abhishek vs Digvesh: నీకు 10.. నాకు 10 అంటూ పంచాయితీ తెంపిన BCCI VP రాజీవ్ శుక్లా
సెంటిమెంట్ కారు గిఫ్ట్ గా ఇచ్చేశాడు…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సెంటిమెంట్ కారును.. గిఫ్ట్ గా ఇచ్చేశాడు. ఈ లంబోర్గిని ఉరుస్ బ్లూ కారు రోహిత్ శర్మ లైఫ్ లో ఎంతో స్పెషల్. దీనికి కారణం లేకపోలేదు. వన్డే మ్యాచ్లలో తన హైయెస్ట్ స్కోర్ కు గుర్తుగా దాని నెంబర్ 264 గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు రోహిత్ శర్మ. ముంబై వీధిలో ఎప్పుడు తిరిగినా ఈ బ్లూ కారులో మాత్రమే రోహిత్ శర్మ తిరుగుతూ ఉంటాడు. ఆయన గిఫ్ట్ గా…. ఇవ్వబోడని అందరూ అనుకున్నారు. కానీ ముందుగా యాడ్ లో ప్రకటించినట్లుగానే… విన్నర్ కు అందజేశాడు రోహిత్ శర్మ. ఇప్పుడు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్ శర్మ గిఫ్ట్ గా ఇవ్వడంపై ఆయన అభిమానులు కూడా సంబరపడిపోతున్నారు. తాను ఎంతో ఇష్టపడి తీసుకున్న లంబోర్గిని ఉరుస్ కారును ఇలా గిఫ్ట్ ఇవ్వడం రోహిత్ శర్మ గొప్పతనం అని కొనియాడుతున్నారు. నీలాంటోడు టీమిండియాలో ఇంకో 10 ఏళ్లు ఉండాలని కోరుతున్నారు.
ప్లే ఆఫ్ రేసులో ముంబై ఇండియన్స్( MI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ముంబై ఇండియన్స్ జట్టును ( Mumbai Indians team ) మళ్ళీ గాడిలో పెట్టాడు రోహిత్ శర్మ. కష్టాల్లో ఉన్న జట్టును… చివరి మ్యాచ్లలో ఆదుకున్నాడు రోహిత్ శర్మ ( Rohit Sharma). చెన్నై, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ లాంటి జట్ల పై దుమ్ము లేపాడు. ఈ నేపథ్యంలోనే ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది ముంబై ఇండియన్స్.
Also Read: Also Read: Preity Zinta: శ్రేయస్ ను కాదని వైభవ్ కు ప్రీతీ జింటా హాగ్.. 14 ఏళ్ళ కుర్రాడితో ఏంటి అరాచకం ?
4 కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్ గా ఇచ్చిన రోహిత్ శర్మ#IPL2025 ప్రారంభంలో ఓ యాడ్లో చెప్పినట్లుగానే ఆయన కారును గిఫ్ట్ గా ఇచ్చి, ఆ ఫ్యామిలీతో ఫోటోలు దిగారు.#RohitSharma𓃵 pic.twitter.com/a3WnnG3oeU
— greatandhra (@greatandhranews) May 20, 2025