Jacob Bethell : సాధారణంగా క్రికెట్ (Cricket) లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి.ఎప్పుడూ ఏ ఆటగాడు అద్భుతంగా ఆడుతాడో చెప్పలేని పరిస్తితి. కొందరూ ఆటగాళ్లు తొలుత అంతగా ప్రతిభ కనబరచరు. మరికొందరూ మాత్రం తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన ప్రతిభను కనబరుస్తారు. కానీ తొలి మ్యాచ్ లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్ల కంటే.. కాస్త గ్యాప్ తీసుకొని ఆడే ఆటగాళ్లు.. బాగా ఆడుతారు. తనలో ఉన్నటువంటి టాలెంట్ ను మొత్తం వెలుగులోకి తీసుకొస్తారు. తాజాగా ఇంగ్లాండ్ కి చెందిన జాకబ్ బెథెల్ (Jacob Bethell) ఐపీఎల్ 2025 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. ప్లే ఆప్స్ కి చేరుకున్న తరువాత బెథెల్ ఇంగ్లాండ్ జట్టు తరుపున ఆడేందుకు వెళ్లాడు. అయితే అక్కడ అద్భుత ప్రదర్శన చేశాడు.
Also Read : Team India : ఫ్యాన్స్ కు అలర్ట్.. ఈ ఏడాది టీమిండియా ఆడబోయే మ్యాచ్ లు ఇవే
ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఎంపిక కాకముందు బెథెల్ అంటే పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైతే ఐపీఎల్ కి ఎంపికయ్యాడో అప్పటి నుంచి చాలా ఫేమస్ అయ్యాడు. ఐపీఎల్ మధ్యలో వెళ్లిపోయినప్పటికీ.. ఐపీఎల్ లో కొన్ని కీలక ఇన్నింగ్స్ ద్వారా ఆర్సీబీ అభిమానులకు చేరువయ్యాడు. మరోవైపు ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ ఛాంపియన్ గా నిలవడం విశేషం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన తరువాత అతనికి ఇంగ్లాండ్ తరపున టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు అవకాశం వచ్చింది. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడాడు. మరోవైపు ఇంగ్లాండ్ తరపున ఇతను ఐర్లాండ్ తో జరిగిన టీ 20 మ్యాచ్ కి కెప్టెన్ గా వ్యవహరించాడు. మరోవైపు సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ లో సెంచరీ కూడా చేశాడు. దీంతో బెథెల్ రికార్డులు నమోదు చేస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన తరువాత ఈ ఆటగాడికి అంతా అదృష్టం కలిసి వస్తోంది.
ఇటీవల సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరిగింది. తొలి రెండు మ్యాచ్ లు సౌతాఫ్రికా విజయం సాధించి వన్డేసిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన చివరి వన్డేమ్యాచ్ లో ఇంగ్లాండ్ మాత్రం విశ్వ రూపమే చూపించింది. ముఖ్యంగా స్వదేశంలో సిరీస్ ఓడిపోయామనే బాధ ఓ వైపు.. మరోవైపు సొంతగ గడ్డ పై పరువు కాపాడుకోవాలనే ఒత్తిడి మూడో వన్డేకు ముందు ఇంగ్లాండ్ జట్టును ఆందోళనకుగురి చేశాయి. సౌతాఫ్రికా పై ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 342 పరుగుల తేడాతో ఘన విజయం సాదించింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 414 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో రూట్ 100, జాకబ్ బెథెల్ 110 ఇద్దరూ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా 72 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 342 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఈ దెబ్బకు బెథెల్ ను ఆర్సీబీ వదులుకోదని పలువురు అభిమానులు పేర్కొంటున్నారు.