Kajal Agarwal: తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఇష్టమైన నటి కాజల్ అగర్వాల్. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసిన కాజల్ తనకంటూ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కొన్ని సందర్భాల్లో సంబంధం లేని వార్తలు వస్తుంటాయి. ఆ వార్తలు చాలామంది సెలబ్రిటీలకే ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఈరోజు కూడా కాజల్ అగర్వాల్ కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి.
ఆ వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయి అంటే ఏకంగా కాజల్ దృష్టికి చేరాయి. దీనిపై కాజల్ స్పందించింది. ఇంస్టాగ్రామ్ వేదికగా స్టోరీ పెట్టి మరి క్లారిటీ ఇచ్చింది కాజల్. ” నేను ఒక ప్రమాదంలో చిక్కుకున్నానని (మరియు ఇకపై కాదు!) చెప్పుకుంటూ కొన్ని నిరాధారమైన వార్తలు వచ్చాయి. మరియు నిజాయితీగా చెప్పాలంటే, ఇది పూర్తిగా నిజం కాదు కాబట్టి ఇది చాలా సరదాగా ఉంది.
దేవుని కృపతో, నేను పూర్తిగా బాగున్నాను, సురక్షితంగా ఉన్నాను మరియు చాలా బాగా చేస్తున్నాను అని మీ అందరికీ హామీ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు అలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని అలానే ఎవరికి స్ప్రెడ్ చేయవద్దని నేను దయతో కోరుతున్నాను. సానుకూలత మరియు సత్యంపై మన దృష్టిని ఉంచుదాం. అంటూ కాజల్ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టారు. ఏకంగా కాజల్ క్లారిటీ ఇవ్వటంతో కాజల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read : Sanjana Garlani : పాపం ఈ పిల్ల తెలియక బూతులు మాట్లాడేస్తుంది