పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి వివాహేతర సంబంధాలు. భార్యలు భర్తలను కాదని పరాయి మగాళ్లతో.. భర్తలు భార్యలను కాదని ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేస్తుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చివరకు ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయి.
తాజాగా ఓ భార్య పరాయి వ్యక్తితో భర్తకు రెడ్ హ్యాండెడ్ పట్టుబడింది. భార్యను అలాంటి పరిస్థితిలో చూసి అతడు తట్టుకోలేకపోయాడు. గుండెలు అవిసేలా రోదించాడు. భార్య అతడికి క్షమాపణలు చెప్తూ వేడుకున్నా, అతడు షాక్ లోనే ఉండిపోయాడు. కదలకుండా ఉండిపోయాడు. అతడికి కొంత మంది నీళ్లు తాగిస్తూ ఓదార్చుతున్నారు. భార్య అతడిని పట్టుకుని ఏడుస్తూ కనిపిస్తుంది. అతడు మాత్రం ఏడ్చి ఏడ్చి ఫ్రీజ్ అయిపోయాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది కచ్చితంగా తెలియదు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియోను చూసి నెటిజన్లు భార్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది మహిళలు కూడా ఆమె తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. “అతడు అమెను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. ఇలాంటి పనులు ఎవరు చేసినా మినహాయింపు కాదు. ఒకవేళ అతడు క్షమించినా, ఆమె మారుతుందనే ఆశ ఉండదు” అని ఓ మహిళ కామెంట్ చేసింది. “అతడికి దొరకడానికి కొన్ని నిమిషాల క్రితం వరకు ఆమె ప్రేమికుడితో లోతైన ప్రేమలో ముగిపోయింది. ఇప్పుడు ఎక్కడలేని బాధ పడుతుంది. ఆమె నటన ఎంత గొప్పగా ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఇలాంటి వారికి విధేయత, సిగ్గు అనేవి ఉండవు. కేవలం కామం, ద్రోహం మాత్రమే ఉంటాయి” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “ఇక ఆ వ్యక్తి జీవితంలో ఈ సంఘటనను మర్చిపోలేడు. ఈ షాక్ అతడి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఆమె అవసరం అయితే, తన ప్రియుడితో వెళ్లిపోయి హ్యాపీగా ఉంటుంది. ఆమెకు ఏం కాదు. కానీ, అతడు మాత్రం రోజు రోజు కుంగి కుశించి పోతాడు” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.
Read Also: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?
అటు “సదరు భర్త ఎప్పటికీ ఆమెను క్షమించకూడదు. ఒకవేళ అతను ఆమెను క్షమించినట్లయితే, చంపబడటం లేదంటే కోర్టుకు లాగబడటం ఖాయం. ఆమె నుంచి ఇప్పుడే తెగదెంపులు చేసుకోకపోతే, ఇప్పుడు మానసికంగా కుంగిపోయాడు. భవిష్యత్తులో ఆర్థికంగా కుంగిపోతాడు” అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. “కొంతమంది మహిళలు నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకోవడం, వారి స్వార్థపూరిత కారణాల వల్ల జీవితాలను నాశనం చేసుకోవడం అసహ్యంగా ఉంది. ఈ రకమైన ద్రోహం కంటే చావడం బెస్ట్” అని మరో మహిళ రాసుకొచ్చింది.
Husband collapsed after he #caught wife with lover.
The wife is bagging for his forgiveness. pic.twitter.com/dNqW7guvIe
— ShoneeKapoor (@ShoneeKapoor) September 8, 2025
Read Also:శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?