BigTV English

Volodymyr Zelenskyy: బాగా చేశారు.. ఇండియాపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అనుచిత వ్యాఖ్యలు

Volodymyr Zelenskyy: బాగా చేశారు.. ఇండియాపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అనుచిత వ్యాఖ్యలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్ స్కీ పై దాదాపు అన్ని దేశాల్లోనూ సింపతీ ఉంది. రష్యాకు ఎదురొడ్డి నిలిచారని, రష్యాని సైతం గడగడలాడిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఓ దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కూడా నిక్కచ్చిగా వ్యవహరించారనే పేరుంది. కానీ భారత్ విషయంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు ఆ ఈమేజ్ ని డ్యామేజ్ చేశాయని చెప్పాలి. రష్యాతో ఉక్రెయిన్ కి శత్రుత్వం ఉండొచ్చు, ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుండొచ్చు. కానీ రష్యాతో వ్యాపారం చేసే అన్ని దేశాలను ఉక్రెయిన్ శత్రువులుగా భావించడం సరికాదు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ట్రంప్ సుంకాలు విధించడాన్ని ఉక్రెయిన్ సమర్థించడం కూడా కరెక్ట్ కాదు.


జెలెన్ స్కీ అనుచిత వ్యాఖ్యలు..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై ట్రంప్ సుంకాలను భారీగా పెంచడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సమర్థించారు. ఇటీవల జరిగిన SCO సమ్మిట్‌ లో మోదీ-పుతిన్-జిన్ పింగ్ మధ్య స్నేహం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇదే విషయంపై జెలెన్ స్కీ కూడా స్పందించాల్సి వచ్చింది. రష్యాతో స్నేహంగా ఉన్నందుకు ఇతర దేశాలపై అమెరికా ఆంక్షలు విధించిందని, వారు ఎదురు దెబ్బలు తినాల్సి వస్తోందని అన్నారు. అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్ కూడా రష్యాపై ఆంక్షలను విస్తరించేందుకు సన్నద్ధమవుతోందని ఆయన చెప్పారు. రష్యాతో స్నేహం చేసే ఇతర దేశాలకు కూడా ఇదే గతి పడుతుందని పరోక్షంగా భారత్ పేరెత్తకుండా విమర్శించారు జెలెన్ స్కీ.

బలమైన ప్రతిస్పందన..
ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన అతిపెద్ద దాడికి అమెరికా నుంచి మరింత బలమైన ప్రతిస్పందనను ఆశిస్తున్నట్లు జెలెన్ స్కీ తెలిపారు. అంటే ఆయన ఇప్పుడు విధించిన సుంకాలతో సంతృప్తి చెందినట్టు లేదు. ఇంతకంటే ఎక్కువ సుంకాలు విధించి, రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలను టార్గెట్ చేయాలనేది జెలెన్ స్కీ ఉద్దేశంలా అనిపిస్తోంది. తాజాగా ఉక్రెయిన్ పై అతిపెద్ద దాడి జరిగిందని, దానికి అమెరికా బదులు తీర్చుకుంటుందని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు జెలెన్ స్కీ. ఇటీవల అలాస్కాలో ట్రంప్-పుతిన్ మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా నిర్ణయాలు తీసుకుంటారని అనుకున్నారంతా. కానీ ఆ సమావేశంలో ఎలాంటి పురోగతి లేదు. దీంతో అమెరికా తన సుంకాల అస్త్రాన్ని బయటకు తీసింది. ఇక రష్యాపై మరిన్ని ఆంక్షల గురించి చర్చించడానికి యూరోపియన్ యూనియన్ యొక్క ఆంక్షల రాయబారి డేవిడ్ ఓ-సుల్లివన్ కూడా అమెరికాలో ఉండటం విశేషం. వచ్చే శుక్రవారం నాటికి రష్యాపై 19వ ఆంక్షల ప్యాకేజీని యూరోపియన్ కమిషన్ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.


మధ్యలో ఇండియా ఏం చేసింది..?
రష్యాతో వ్యాపార సంబంధాలు నెరిపే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అంత మాత్రాన ఆంక్షలతో ఇండియాని భయపెట్టాలని చూడటం సరికాదు. అమెరికా సుంకాల నిర్ణయాన్నే ధైర్యంగా ఎదిరించి నిలబడిన దేశం మనది. ఉక్రెయిన్ వెటకారాలకు మనం జంకుతామా. రష్యా చేతిలో దెబ్బలు తిన్న ఉక్రెయిన్ భారత్ పై పడి ఏడవటం ఎంతవరకు కరెక్ట్ అనేది అంతర్జాతీయ నిపుణుల వాదన.

Related News

Trump Tariffs: అమెరికా టారిఫ్‌లతో ఇండియాకు లాభమే.. అదే జరిగితే ట్రంప్ ఏమైపోతాడో!

Gen Z Movement: రీల్స్ లేవు.. షార్ట్స్ లేవు.. రొడ్డుపైకెక్కి గగ్గోలు పెడుతోన్న నేపాల్ యువత, 16 మంది మృతి

Elon Musk: ప్రపంచంలోనే అత్యధిక జీతం.. మస్క్ మామకు టెస్లా భారీ ఆఫర్.. వామ్మో, అన్ని లక్షల కోట్లా?

Donald Trump: నా జానే జిగర్ మోదీ! వెనక్కి తగ్గిన ట్రంప్..

Afghan Women: అఫ్ఘాన్ భూకంప శిథిలాల్లో మహిళలు.. బతికున్నా రక్షించకుండా వదిలేసిన మగాళ్లు!

Big Stories

×