BigTV English

Adipurush : ‘ఆది పురుష్’ పోస్ట‌ర్‌పై వివాదం.. కేసు నమోదు

Adipurush : ‘ఆది పురుష్’ పోస్ట‌ర్‌పై వివాదం.. కేసు నమోదు
Adipurush

Adipurush : ప్ర‌భాస్ రాముడిగా న‌టించిన చిత్రం ‘ఆది పురుష్’. ఈ సినిమా ఏ ముహూర్తాన అనౌన్స్ చేశారో తెలియ‌దు కానీ అడ్డంకులు ఎదుర‌వుతున్నాయి. వివాదాలు వ‌స్తున్నాయి. తాజాగా ఈ మూవీపై ముంబైలో కేసు న‌మోదైంది. శ్రీరామ‌న‌వమి సంద‌ర్భంగా ఆది పురుష్ టీమ్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇందులో శ్రీరాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, లక్ష్మ‌ణుడు, హ‌నుమంతుడి పాత్రధారులు క‌నిపిస్తున్నారు. దీనిపై స‌నాత‌న భోధ‌కుడిగా చెప్పుకునే సంజ‌య్‌ దీనానాథ్ అనే వ్య‌క్తి ఆది పురుష్ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, న‌టీన‌టుల‌పై కేసు పెట్టారు.


ఇంత‌కీ సంజ‌య్ త‌న కంప్లైంట్‌లో ఏం చెప్పార‌నే వివ‌రాల్లోకి వెళితే, రామ‌చ‌రిత మాన‌స్‌ను హిందువులు ఎంత ప‌విత్రంగా చూస్తుంటారు. అలాంటి గ్రంథంలో చెప్పిన‌ట్లు పాత్ర‌ల‌ను చూపించ‌టం లేద‌ని ఆయ‌న ఫిర్యాదు పేర్కొన్నారు. ఆదిపురుష్ ద‌ర్శక నిర్మాత‌లు, న‌టీన‌టులపై సెక్షన్ 295 (A), 298, 500, 34 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ కంప్లైంట్ చేశారు.

హిందూ స‌నాత‌న ధ‌ర్మంలో జంధ్యంకుఓ ప్రాముఖ్య‌త ఉంది. మ‌న పూర్వీకులు స‌నాత‌న ధ‌ర్మాన్ని అనుస‌రించారు. కానీ ఆదిపురుష్ చిత్రంలోని పాత్ర‌ల‌ను జంధ్యం లేకుండానే చూపిస్తున్నార‌ని ఆది పురుష్‌ పోస్ట‌ర్‌లో చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. మరిప్పుడు దీనిపై ఆది పురుష్ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. టి సిరీస్ బ్యాన‌ర్‌పై ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందుతోంది.


నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది జనవరి 12న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే టెక్నికల్‌గా సినిమా బాగో లేకపోవటం. పాత్రలను చిత్రీకరించిన తీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేయటంతో మేకర్స్ వెంటనే సినిమా రిలీజ్ వాయిదా వేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మళ్లీ చేసి మార్పులు చేర్పులు చేస్తున్నారు. జూన్ 16న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×