Rag Mayur: టాలెంట్ ఉన్న నటులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పటికీ ఆదరిస్తుంది అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కేవలం తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకున్న హీరోలు చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న తెలుగు హీరోల్లో రాగ్ మయూర్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో వచ్చిన సినిమా బండి సినిమా విపరీతమైన పేరు తీసుకొచ్చింది.
కొన్నిసార్లు పాత్రలు గుర్తుండడం అనేది రేర్ గా జరుగుతుంది. అలానే మరిడేస్ బాబు అనే పాత్ర కూడా చాలామందికి గుర్తుండిపోయింది. ముఖ్యంగా రాయలసీమ యాసను రాగ్ మాట్లాడిన విధానం చాలామందిని విపరీతంగా ఆ కొట్టుకోవడం మాత్రమే కాకుండా మంచి ఫన్ క్రియేట్ చేసింది.
ఒక సినిమా సక్సెస్ అవ్వగానే వరుసగా అవకాశాలు రావడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సాధారణంగా జరుగుతుంది. అయితే అన్ని అవకాశాలను ఉపయోగించుకోకుండా, ఏ సినిమా చేస్తే మన కెరియర్ కి ప్లస్ అవుద్ది అని కంప్లీట్ క్లారిటీ రాగ్ మయూర్ కి ఉంటుంది అని చెప్పొచ్చు. తను ఎంచుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ ను సాధిస్తున్నాయి.
డిజె టిల్లు సినిమా సిద్దు జొన్నలగడ్డకు విపరీతమైన పేరు తీసుకుంది. ఆ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత టిల్లు స్క్వేర్ సినిమాకి కూడా దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. కానీ వెంటనే ఆ జోనర్ లో సినిమా చేయడం ఇష్టం లేకపోవడం వలన చేయలేదు. ఇక ప్రస్తుతం రాగ్ మయూర్ హీరోగా విమల్ కృష్ణ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రానుంది. ఈ సినిమాకి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.