BigTV English

Diwali Movies : అన్ని సినిమాలు చూస్తున్నారు, ఇటువంటి సందర్భాల్లోనే తెలుగు ఆడియన్స్ ను మించిన వాళ్లు లేరు అనిపిస్తుంది

Diwali Movies : అన్ని సినిమాలు చూస్తున్నారు, ఇటువంటి సందర్భాల్లోనే తెలుగు ఆడియన్స్ ను మించిన వాళ్లు లేరు అనిపిస్తుంది

Diwali Movies : సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఆడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక భాషతో, ఒక నటుడుతో సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా అద్భుతమైన సినిమాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో భాష అర్థం కాకపోయినా కూడా ఆ సినిమాలను సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ చూస్తారు. మిగతా ఫిలిం ఇండస్ట్రీస్ కన్నా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రెవెన్యూ కూడా ఎక్కువగా వస్తుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ప్రేక్షకులు సినిమాలకు బ్రహ్మరథం పడతారు కాబట్టి చాలామంది తమిళ్ హీరోల సినిమాలు ఇక్కడ అద్భుతమైన ఘనవిజయాలు సాధించాయి. కమలహాసన్, రజనీకాంత్, విక్రమ్, సూర్య, విశాల్ వంటి ఎందరో తమిళ్ నటుల సినిమాలు కూడా ఇక్కడ అద్భుతమైన ఘన విజయాలు సాధించాయి. తెలుగు ప్రేక్షకులకి భాషతో సంబంధం లేదు అనడానికి ఇది కూడా ఒక నిదర్శనం. కానీ తెలుగు హీరోల సినిమాలు తమిళ్ లో ఆడిన దాఖలాలు తక్కువ.


మరోసారి తెలుగు ప్రేక్షకులకు గొప్పతనం ఏంటో ఈ దివాళి సినిమాల వలన రుజువయింది. మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పటికీ కూడా ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా గురించి నిర్మాత రిలీజ్ కంటే ముందు నుంచే మంచి కాన్ఫిడెంట్ గా ఉండేవాళ్ళు. రిలీజ్ తర్వాత కూడా అదే కాన్ఫిడెంట్ ని కొనసాగిస్తున్నారు. ఈ సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఈ సినిమాతో పాటు శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ సినిమా కూడా రిలీజ్ అయింది. శివ కార్తికేయన్ తమిళ్ హీరో అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

Also Read : Viswam Movie OTT: చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. ఇలా అయితే ఎలా మాస్టారూ


ఇక తెలుగు హీరో చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా క. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. వరుస డిజాస్టర్ సినిమాలను మూట కట్టుకున్న కిరణ్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. దాదాపు కిరణ్ పరిస్థితి అయిపోయింది అనుకునే టైంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాతో ప్రాక్టికల్ ముందుకు వచ్చాడు కిరణ్. ఇక ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా రానున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే కిరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా చేస్తాడా లేదంటే కొత్త సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తాడు అనేది త్వరలో తెలియనుంది. మొదటినుంచి ఈ సినిమా గురించి కూడా కిరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా ఫలితం తేడా కొడితే సినిమాలు మానేస్తాను అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×