BigTV English

Nora Fatehi: ఆ సాంగ్ కి చిన్న జాకెట్ ఇచ్చారు.. అలా చూపించకండి అని వేడుకున్నాను

Nora Fatehi: ఆ సాంగ్ కి చిన్న జాకెట్ ఇచ్చారు.. అలా చూపించకండి అని వేడుకున్నాను

Nora Fatehi: ఇండస్ట్రీ.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ నెగ్గుకు రావాలంటే ఒక్కొక్కరికి ఒక్కో ప్లాన్ ఉంటుంది. కొంతమంది నటనతో ఆ ఛాన్స్ లను అందుకుంటారు. ఇంకొంతమంది అందాల ఆరబోస్తూ అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా ఐటెంసాంగ్స్ చేసే హీరోయిన్స్ బట్టలు మరీ పొట్టిగా ఉంటాయి. అందాలను ఆరబోయడానికే ఆమన్తా చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. అందాలు ఆరబోస్తున్నారు కదా అని.. వారు అదంతా ఇష్టంతోనే చేస్తున్నారు అని అనుకోవడం పొరపాటు. కొన్నిసార్లు కొన్ని ఇష్టాలను  వదులుకుంటూనే పైకి ఎదగలగలరు అని చాలామంది నిరూపించారు. ఇక అందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి కూడా ఉంది.


నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. కుర్రకారుకు ఫేవరేట్ ఐటెంభామ అంటే నోరా పేరే వినిపిస్తుంది. బాహుబలి సినిమాలో మనోహరీ సాంగ్ తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ స్టార్ డ్యాన్సర్ గా కొనసాగుతోంది. ఇక అమ్మడు అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఇప్పుడు స్టార్ గా ఉన్న ఆమె కెరీర్ మొదట్లో  ఎన్నో ఇబ్బందులకు గురయ్యిందట.  తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనోహరీ తన మనోగతాన్ని బయటపెట్టింది.

Viswam Movie OTT: చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. ఇలా అయితే ఎలా మాస్టారూ


” నేను సినిమాల మీద ఆశతో మోడలింగ్ కెరీర్ ను ఎంచుకున్నాను. విదేశీ మోడల్ గా ఇండియాకు వచ్చాను. మోడల్ ఏజెన్సీల వలన చాలా ఇబ్బందులు పడ్డాను. రెంట్ కట్టడానికి డబ్బులు కూడా ఉండేవి  కాదు.  ఆ సమయంలోనే రోర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఇక నా కెరీర్ లో గుర్తింపు తెచ్చిన సాంగ్స్ సత్యమేవ జయతే సినిమాలో దిల్బర్, స్త్రీ సినిమాలో కమారియా అని చెప్పాలి. అయితే సత్యమేవ జయతే సినిమాలో దిల్బర్ సాంగ్ కు చాలా చిన్న బట్టలు ఇచ్చారు.  ఆ జాకెట్ చాలా చిన్నగా ఉంది. అది నాకు నచ్చలేదు. మరీ అంత సెక్సువలైజ్ గా చూపించకండి అని వారికి చెప్పాను. దయచేసి ఇంత చిన్నబట్టలు వేసుకోలేను.. ఇంకేమైనా ఇవ్వండి అని అడగాన్నే.. ఆ తరువాతి రోజు.. సాంగ్ లో నేను వేసుకున్న  కాస్ట్యూమ్ ఇచ్చారు. ఇవి కూడా చిన్నవేగా అంటే.. వాటికన్నా చిన్నవి  ఇచ్చారు.

Deepika-Ranveer Singh: బ్రేకింగ్.. దీపికా- రణ్వీర్.. కూతురు పేరు చెప్పేశారోచ్

ఇక ఈ రెండు సాంగ్స్ వారాల వ్యవధిలోనే  పూర్తి చేశాను. ఆ సాంగ్స్ కు ఇప్పటివరకు నిర్మాత డబ్బులు ఇవ్వలేదు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు.. కెరీర్ ముఖ్యం. అది సెట్ అయితే తరువాత డబ్బులు గురించి ఆలోచిద్దాం అనుకున్నాను. నన్ను నేను నిరూపించుకుందామనే ఆ సాంగ్స్ లో నటించాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నోరా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక  తెలుగులో ఈ చిన్నది మట్కా సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల  ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో  నోరా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×