E-Paper
Advertisement

Chatrapathi Sekhar Wife: ఛత్రపతి నటుడు శేఖర్ భార్యను చూశారా..? ఈమె చాలా ఫేమస్..

Chatrapathi Sekhar Wife: ఛత్రపతి నటుడు శేఖర్ భార్యను చూశారా..? ఈమె చాలా ఫేమస్..
Advertisement

Interesting facts about Chatrapathi Sekhar Wife: ప్రభాస్, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి సినిమాలో భద్రం పాత్ర పోషించిన నటుడు చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక్క బాహుబలి సిరీస్ తప్ప రాజమౌళి తెరకెక్కించిన అన్ని సినిమాల్లో ఆయన నటించాడు. రాజమౌళి సినిమాలు మాత్రమే కాదు.. ఆయన సినిమాల్లో నటించిన నటీనటులను కూడా మర్చిపోలేము. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ వరకు ఆయన సినిమాల్లో నటించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్రశేఖర్ మనకి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాడు. అసలు రాజమౌళి సినిమా అంటే చంద్రశేఖర్ ఉండాల్సిందే. అంతలా పేరు వచ్చేసింది ఆయనకు.

చంద్రశేఖర్ రాజమౌళి తీసిన సినిమాల్లో ఛత్రపతి సినిమా ద్వారా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా శేఖర్ నటన ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాయి. కేవలం రాజమౌళి సినిమాలు మాత్రమే కాదు.. ఇతర డైరక్టర్ల సినిమాల్లో కూడా మంచి రోల్స్ చేశాడు. ఇక ఛత్రపతి సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఎన్నో విభన్నమైన పాత్రలతో అనతి కాలంలోనే మోస్ట్ టాలెంట్ కారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగాడు.

Advertisement

ఇవన్ని పక్కన పెడితే చంద్రశేఖర్ భార్య మన తెలుగు ఇండస్ట్రీలోనే అతి పెద్ద నటి అన్న విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. చంద్రశేఖర్ భార్యపేరు నీలియా భవాని. ఆమె టాలీవుడ్ లో కిక్ 2, సైరా నరసింహా రెడ్డి, నానీ జెంటిల్ మెన్, రామ్ పోతినేని నటించిన పండుగ చేస్కో వంటి సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసింది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్ లోకూడా అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది.

Also Read: ఆకట్టుకుంటున్న ‘అలనాటి రామచంద్రుడు’ ట్రైలర్‌..మీరూ చూసేయండి!

Advertisement

ప్రస్తుతం ఆమె బుల్లితెర సీరియల్స్ లో మంచి డిమాండ్ ఉన్న కారెక్టర్ ఆర్టిస్టు మాత్రమే కాకుండా మోడలింగ్ లో మంచి నైపుణ్యం కూడా ఉంది. ఖమ్మంలో జన్మించిన నీలియా భవాని ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లి దండ్రలు వీరిద్దరి ప్రేమను ఒప్పుకోలేదట. ఆతర్వాత చంద్రశేఖర్ సినిమాల అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడే రాజమౌళి తెరకెక్కిస్తున్న శాంతి నివాసం సీరియల్లో చిన్న పాత్రలో పోషించే అవకాశం దక్కింది.

అలా చంద్రశేఖర్ సినిమాల్లో బిజీగా అవడంతో నీలియా భవానీ కూడా ఆయన అడుగు జాడల్లో నడిచి సినీరంగంలో ప్రవేశించి మంచిపాత్రలు పోషిస్తూ అతి తక్కువ కాలంలోనే స్టార్ కారెక్టర్ ఆర్టిస్టుగా ఎదిగింది. మంచిగా సాగుతున్న వీరిద్దరి దాంపత్య జీవితంలో కొన్నివ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు నీలియా భవానీతోపాటు ఉన్నారు. కూతురు పూజిత అపోలో మెడికల్ కాలేజీలో మెడిసన్ చేస్తుండగా, కొడుకు మహేశ్వరన్ క్రికెటర్ గా స్థిరపడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×