Saif Ali Khan: ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ పేరు హాట్ టాపిక్ అవుతుంది.. ఈరోజు ఆయన పై హత్యాప్రయత్నం చేశారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరో సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చెయ్యడంతో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుండగులు ఆరుసార్లు సైఫ్ ను కత్తితో పొడవడంతో వెన్నెముకలో కత్తి దిగింది. సర్జరీ చేసి కత్తిని తొలగించినట్టు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో వైద్యులు పేర్కొన్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ను పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రాణాలతో బయట పడ్డారు. ఇక ఈ దాడిని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే విషయం పై పోలీసులు విచారణ జరుగుపుతున్నారు.. అయితే ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ అవుతుంది.. ఆయనకు ఎన్ని వేల కోట్లా ఆస్తులు ఉన్నాయి.. ఆస్తుల కోసమే గొడవలు జరుగుతున్నాయా అని చర్చ నడుస్తుంది.. ఆయన ఆస్తుల వివరాల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సైఫ్ ఆలీ ఖాన్ పై దాడి..
బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వందల సినిమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగోన్నాడు. ఆయన సినిమాల పరంగానే కాదు.. పలు వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తూ అందరికి దగ్గరయ్యారు. అయితే ఆయన పై దాడి జరగడం పై సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు షాక్ అవుతున్నారు. అంత పెద్ద హీరోకు ఇలా జరగడం పై ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తులు గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. సైఫ్ ఫ్యామిలీ గురించి ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సైఫ్ ఆస్తుల వివరాలు..?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఒక రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి.. నవాబుల కుటుంబం నుంచి ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తండ్రి పేరు మన్సూర్ అలీఖాన్ పటౌడీ.. ఆయన తండ్రి మాజీ క్రికెట్ ఆటగాడు. ఎన్నో మ్యాచ్లలో ఆడి తన సత్తా నిరూపించుకున్నాడు. ఇండియా తరపున స్టార్ క్రికెటర్స్ లో ఈయన ఒకరని చెప్పాలి.. తల్లి షర్మిలా ఠాగోర్.. ఒక బాలీవుడ్ నటి.. హిందీలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఆమెను సైఫ్ తండ్రి మన్సూర్ అలీఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. తండ్రి అంటే సైఫ్ కు చాలా ప్రేమ. అయినా కోసమని సైఫ్ కరిన ఒక క్రికెట్ టీం ని కొనుగోలు చేశారు. 2024లో మార్చిలో జరిగిన లీగ్ వారి జట్టు విజయం సాధించి చాంపిన్ గా నిలిచింది.. సైఫ్ సినిమాలే కాకుండా పలు వ్యాపారాల్లో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసి కోట్లల్లో లాభాలను పొందాడు. ఇక ఈయనకు వారసత్వంగా వస్తున్న ఆస్తులు 1200 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.. ఎనిమిది వందల కోట్ల విలువచేసే ఖరీదైన ప్యాలెస్ కూడా ఈయనకు ఉంది. సినిమాల్లో సంపాదించింది పలు వ్యాపారంలో సంపాదించింది కలిపి మొత్తం 2, 3 వేల కోట్లకు పైగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.. అటు సైఫ్ భార్య కరీనాకపూర్ కూడా సినిమాలతో బాగానే సంపాదించింది.. తెలిసినవి కొన్ని ఆస్తులు అయితే తెలియనివి చాలా ఉంటాయని ఆయన సన్నిహితులు కూడా చెప్తున్నారు. మొత్తానికి సైఫ్ అలీ ఖాన్ వేలకోట్లకు అధిపతి అని తెలుస్తుంది.. ప్రస్తుతం ఆయనపై ఎవరు దాడి చేశారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇది కావాలని చేశారా లేదా ఎవరైనా దుండగులు చేశారన్న విషయం తెలియాల్సి ఉంది..