ఫార్ములా-ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, కేటీఆర్ ఈడీ విచారణ దాదాపు 7 గంటలపాటు జరిగింది. ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదని ఈడీ ఆరా తీసింది. స్టేట్‌మెంట్లు, కార్ రేసింగ్ పత్రాలను ముందు పెట్టి ప్రశ్నించింది. రేస్ ప్రొసీడింగ్స్ కానీ నగదు బదిలీ కానీ తన ప్రమేయం ఏమీ ఉండదని కేటీఆర్ విచారణలో చెప్పినట్టు సమాచారం. మౌఖిక ఆదేశాలు ఇవ్వడం వల్లే అధికారులు నగదు బదిలీ చేశారని స్టేట్మెంట్లు ఉన్నాయంటూ కేటీఆర్‌ని ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధన ఉల్లంఘనలపై కేటీఆర్ నోరు మెదపలేదని సమాచారం.
ప్లేటు పిరాయించిన కేటీఆర్
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అంతా తన ఆదేశాల ప్రకారమే జరిగిందని అప్పట్లో చెప్పిన కేటీఆర్. విచారణలో మాత్రం ప్లేటు పిరాయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి పొరపాట్లు లేవని స్పష్టం చేశారు. ఏమైనా అవకతకలు ఉన్నట్లు సందేహాలుంటే అధికారులను అడిగి తెలుసుకోవాలంటూ విచారణలో ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనల ఉల్లంఘన ఏదైనా ఉన్నట్లయితే అది అధికారులే చూసుకోవాలని, మంత్రిగా తనకు ఏంటి సంబంధం అని విచారణలో ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అంతేకాదు.. ఇటీవల కోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్‌లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తనకు అసలు ఎలాంటి అధికారాలు ఉండవని, అలాంటప్పుడు తాను అవకతవకలకు పాల్పడినట్లు ఎలా ఆరోపిస్తారని కేటీఆర్ లాజికల్ ఆన్సర్లు ఇచ్చినట్లు సమాచారం.

ఇంకా విచారణ ముగియలేదా?
ఇదే కేసుపై కొద్ది రోజుల కిందట ఏసీబీ సుమారు ఎనిమిది గంటలపాటు విచారించింది. అప్పుడు కూడా కేటీఆర్ ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. తాజాగా జరిగిన ఈడీ విచారణకు కూడా తమ న్యాయవాదులను అనుమతించాలని కేటీఆర్ కోరారు. ఇందుకు ఈడీ నిరాకరించడంతో కేటీఆర్ మాత్రమే విచారణలో పాల్గొన్నారు. అయితే, విచారణ ఇంకా ఉందా.. లేదా అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారా అనే అంశాలపై ఇంకా స్ఫష్టత రావల్సి ఉంది. అయితే, విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్.. గాంభీర్యాన్ని ప్రదర్శించారు. తాను లైడిటెక్టర్ టెస్టుకు కూడా సిద్ధమంటూ ప్రభుత్వానికి సవాలు విసిరారు. అయితే, ఈ కేసు నుంచి కేటీఆర్ అంత సులభంగా తప్పించుకోలేరని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుపై ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్‌ల నుంచి ఈడీ, ఏసీబీ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. మంత్రి ఆదేశాల మేరకే తాము నడుచుకున్నట్లు స్టేట్‌మెంట్లో చెప్పారట. ఈ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ కోరుకున్నట్లే.. అరెస్టు అవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఫార్ములా కేసులో ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీకి ఏసీబీ నోటీసులు