BigTV English

Sapoornesh Babu : దిమ్మతిరిగే రేంజ్‌లో సంపూర్ణేష్ బాబూ ఆస్తులు…ఎన్ని కోట్లో తెలుసా..?

Sapoornesh Babu : దిమ్మతిరిగే రేంజ్‌లో సంపూర్ణేష్ బాబూ ఆస్తులు…ఎన్ని కోట్లో తెలుసా..?

Sapoornesh Babu : తెలుగు సినిమా అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు సంపూర్ణష్ బాబు. ఎటువంటి పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాలు, నటన అంటే ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి మూవీతోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. మాములు స్థాయి నుంచి వచ్చి టాలీవుడ్ హీరోగా మంచి హిట్లు కొడుతూ దూసుకుపోయాడు. అసలు కామెడీ హీరోగా సంపూకు తెలుగునాట చాలా మంచి క్రేజ్ ఉంది. ఈయన చేసింది తక్కువ సినిమాలే.. కానీ జనాలను తన కామెడితో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అయితే ఈయన జీవితం తెరిచిన పుస్తకం కాదు. ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొని ఇప్పుడు స్టార్ అయ్యాడు.ఇదిలా ఉండగా.. సంపూ ఆస్తుల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన ఆస్తుల వివరాలు గురించి ఓ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియను ఊపేస్తుంది. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


సంపూర్ణష్ బాబు.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈయన పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. సంపూ అలియాస్ సంపూర్ణేష్ బాబుకు తెలుగులో మంచి పాపులారిటీనే ఉంది. బర్నింగ్ స్టార్‌గా తెలుగు ఆడియెన్స్ ముద్దుగా పిలుచుకుంటారు.. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాడు.. సంపూ సినిమాలు మరీ బ్లాక్ బస్టర్‌లు… కోట్లు కొట్టవు కానీ.. పెట్టిన బడ్జెట్ మాత్రం నిర్మాతలకు రికవరీ అవుతుంది. నరసింహ చారీ నుంచి బర్నింగ్ స్టార్ సంపుర్ణేష్ వరకు తన సినీ జీవితంలో చిత్ర, విచిత్ర మలుపులు ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ బయట నరసింహ చారీని చూసిన స్టీవెన్ శంకర్ అలియాస్ బేబి దర్శకుడు సాయి రాజేష్.. సంపూతో సినిమా చేయాలని అనుకున్నాడు. అతను రాసుకున్న కథకు హీరోగా సంపూ సరిగ్గా సరిపోతాడని భావించి పేరు మార్చి హిట్ కొట్టాడు. హృదయకాలేయం మూవీ చేశాడు. అది మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అలా ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ స్టార్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆస్తుల వివరాలను బయట పెట్టాడు. అదేంటో చూద్దాం..


సంపూ ఆస్తులు.. 

హృదయకాలేయం హిట్టయి సంపూకు ఓ రేంజ్‌లో పాపులారిటీ వచ్చింది. అంతేకాదు జక్కన్న రాజమౌళి సైతం ఈ సినిమాలో సంపూ యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే ఏ లెవల్‌లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడో అందరికి తెలుసు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన తన ఆస్తుల గురించి బయటపెట్టాడు. సంపూ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక తన ఆస్తుల విషయానికొస్తే.. సినిమాల్లో, తన వృత్తి పరంగా కూడబెట్టంది రూ.5 కోట్ల వరకు ఉంటుందని టాలీవుడ్ వర్గాల సమాచారం.. ఒక కారు, గోల్డ్ షాప్ ఉందని బయట పెట్టాడు. ఇంకా హైదరాబాద్ లో ఇల్లు కూడా ఉందట. ఇక సినిమాల విషయానికొస్తే.. సింగం 123, కొబ్బరి మట్ట, కాలీ ఫ్లవర్ ఇలా కామెడీ సినిమాలతో మంచి మంచి హిట్లు కొట్టుకున్నాడు. చివరగా తమిళ బ్లాక్ బస్టర్ మండేలా రీమేక్ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో కనిపించాడు.. ప్రస్తుతం ఓ ప్రాజెక్టు లో చేస్తున్నాడు. సోదరా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×