BigTV English

OTT Movie : ఇక్కడ మట్టిని ముడితే కాట్లో కప్పెట్టినట్టే… బుర్ర పాడు చేసే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఇక్కడ మట్టిని ముడితే కాట్లో కప్పెట్టినట్టే… బుర్ర పాడు చేసే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓ టి టి వైపు చూస్తున్నారు మూవీ లవర్స్. ఇందులో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక సముద్ర జీవి చుట్టూ తిరుగుతుంది. పార్టీ కోసం బీచ్ కి వెళ్తే ప్రమాదంలో చిక్కుకుంటారు కొంతమంది యువకులు. దాని నుంచి కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఈ మూవీ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగుతుంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ హారర్ సినిమా పేరు ‘ది శాండ్’ (The Sand). 2015 లో వచ్చిన ఈ మూవీకి ఐజాక్ గబాయెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ ఒక వింత జీవి చేసే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఒక కొంతమంది యువకులు బీచ్ లో ఒక రాత్రంతా పార్టీ జరుపుకుంటారు. ఆ తరువాత ఒక మాంసాహార బీచ్‌లో చిక్కుకుంటారు. అక్కడ వీళ్ళు ఒక వింత జీవికి బలి అవుతూ ఉంటారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

ఒక గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ కోసం,కొంతమంది యువకులు ఒక బీచ్‌కి వెళ్లి రాత్రంతా పార్టీ చేస్తారు. వారు ఆనందంగా గడిపిన తర్వాత, మరుసటి ఉదయం వరకు నిద్రపోతారు. ఆ తరువాత వాళ్ళు మేల్కొన్నప్పుడు సూర్యుడు ఎండగా కాస్తూ ఉంటాడు. కానీ అక్కడ వాళ్ళు ఊహించని విధంగా, ఆ బీచ్ ఇసుకలో ఒక విచిత్రమైన జీవి ఉంటుందని తెలుస్తుంది. అది గుండె చప్పుడు ఉన్న ఏ జీవిని అయినా తినేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. పార్టీ తర్వాత కొంతమంది యువకులు లైఫ్‌గార్డ్ షాక్‌లో, కొంతమంది కారులో, మరికొంతమంది పిక్నిక్ టేబుల్ మీద మిగిలి ఉంటారు. వారు ఇసుకను తాకకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే ఇసుకలో దాగి ఉన్న ఒక భయంకరమైన జీవి ఒక భారీ జెల్లీఫిష్ లాంటిది.అక్కడికి వచ్చిన వారిలో ఒక్కొక్కరినీ చంపుతూ ఉంటుంది.

ఈ జీవి ఒక గుడ్డు నుండి పుట్టినట్లు తెలుస్తుంది. దాన్ని పార్టీ సమయంలో ఎవరో పగలగొట్టడంతో అది ఇసుక కిందకి వెళ్లి చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ తినడం మొదలుపెడుతుంది. వారి ఫోన్‌లు కారు ట్రంక్‌లో ఉండటం వల్ల సహాయం కోసం కాల్ చేయలేకపోతారు. కారు బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ పరిస్థితిలో బయటపడడానికి వారు వివిధ ప్రయత్నాలు చేస్తారు. సర్ఫ్‌బోర్డ్‌లను వంతెనలా వాడటం, పెప్పర్ స్ప్రేని ఉపయోగించడం వంటివి చేస్తారు. అయినా కానీ ఒక్కొక్కరూ ఈ జీవికి బలి అవుతూ ఉంటారు. చివరికి, కొంతమంది బీచ్ పెట్రోల్ సహాయంతో బయటపడే ప్రయత్నం చేస్తారు. కానీ ఆ జీవి ఇంకా పెద్దగా పెరిగి ఎక్కువ ముప్పు కలిగిస్తుంది. చివరికి అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ జీవిని అంతం చేస్తారా ? అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×