BigTV English

Sai Pallavi : ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేతిలో రుద్రాక్ష… ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికేనా ?

Sai Pallavi : ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేతిలో రుద్రాక్ష… ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికేనా ?

Sai Pallavi : నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)కి టాలీవుడ్ లో ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. దానికి కారణం ఈ బ్యూటీ మిగతా హీరోయిన్లలా కాకుండా గ్లామర్ షోకి చాలా దూరంగా ఉంటుంది. పక్కింటి అమ్మాయిలా కనిపించే సాయి పల్లవి చాలా కూల్ అని ఆమెతో కలిసి పని చేసిన నటీనటులు చెబుతుంటారు. అయితే సాయి పల్లవి తన కెరీర్ మొదటి నుంచే ఎప్పుడు చూసినా చేతిలో రుద్రాక్ష ధరించి కన్పిస్తోంది. మరి దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?


సాయి పల్లవి చేతిలో రుద్రాక్ష ఎందుకు?

కెరీర్ మొదటి నుంచి మొదలు పెడితే, సాయి పల్లవి (Sai Pallavi) రీసెంట్ గా రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా మూవీ ‘తండేల్’ (Thandel) ఇంటర్వ్యూలలో కూడా చేతిలో రుద్రాక్ష పట్టుకుని కన్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికో ప్రత్యేకమైన కారణమే ఉంది. సాయి పల్లకి రుద్రాక్షను తన తాతయ్య ఇచ్చారట. అయితే అప్పటినుంచి ఆమెకు ప్రార్థించాలి అన్న కోరిక పుట్టిందట. మైండ్ ను పీస్ ఫుల్ గా ఉంచుకోవడానికి ఆమె ఎక్కువగా మెడిటేషన్ చేస్తుంది. కాబట్టి అప్పుడు కూడా ఈ రుద్రాక్ష హెల్ప్ అవుతుందట. ఈ రుద్రాక్ష మాల తన దగ్గర ఉంటే ఆలోచనలు కంట్రోల్ గా ఉంటాయని, ఓవర్ థింకింగ్ తగ్గుతుందని నమ్ముతుందట సాయి పల్లవి.


ఇటు స్పిరిచువల్ గా, అటు పర్సనాలిటీ వైజ్ రుద్రాక్ష ఉంటే తాను ప్రశాంతంగా ఉండగలనని స్వయంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందుకే ఎప్పుడూ చేతిలో రుద్రాక్ష జపమాలను పట్టుకుని కనిపిస్తుంది. కానీ తాజాగా సాయి పల్లవి రుద్రాక్ష మాలతో హైలెట్ కావడంతో గతంలో జరిగిన ఓ వివాదం మళ్లీ తెరపైకి రాకుండా ఉండడానికేనా ? అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.

వివాదం ఏంటంటే?

‘విరాటపర్వం’ సినిమా ప్రమోషన్లలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ “ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అనే విషయాన్ని మనం చెప్పలేము. కొన్నాళ్ల క్రితం కాశ్మీరీ ఫైల్స్ అనే మూవీ రిలీజ్ అయింది. ఆ టైంలో కాశ్మీర్ పండిట్లను ఎలా చంపారో అందులో చూపించారు. అయితే దాన్ని రిలీజియస్ కాన్ప్లిట్ అనుకుంటే… కోవిడ్ టైంలో ఓ బండిలో ఆవులను తీసుకెళ్తున్న ముస్లింలను కొంతమంది కొట్టి, జైశ్రీరామ్ అన్నారు. అయితే అప్పుడు వాళ్లు చేసిన దానికి, ఇప్పుడు వీళ్ళు చేసిందానికి తేడా ఏముంది? మతం పేరుతో మనం మంచిగా ఉండాలి. మంచి పర్సన్ అయితే హర్ట్ చెయ్యం, వేరొకరి పైన ప్రెషర్ పెట్టం” అని కామెంట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె కామెంట్స్ వివాదానికి దారితీసాయి.

సాయి పల్లవి యాంటీ హిందూ అంటూ భజరంగ్ దళ్ నేతలు, అఖిల భారత గో సేవా ఫౌండేషన్ వారు అప్పట్లో సాయి పల్లవి పై కేసు పెట్టారు. ఇక ఇప్పుడు సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ‘తండేల్’ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతున్న తరుణంలో ఆ వివాదాన్ని, రుద్రాక్షను లింకు చేసి కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇక సాయి పల్లవి ప్రస్తుతం ‘రామాయణం’ అనే సినిమాలో సీత పాత్ర చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆమె నిష్టగా ఉంటున్నట్టు టాక్ నడుస్తోంది. రీసెంట్ గా డైరెక్టర్ చందూ మొండేటి కూడా సాయి పల్లవి అంత సాత్వికురాలు ప్రపంచంలోనే ఉండరు అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×