Kevin Pietersen: భారత్ – ఇంగ్లాండ్ మధ్య ఆధ్యాంతం ఉత్కంఠ భరితంగా సాగిన నాలుగవ టి-20లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని పూణే స్టేడియం వేదికగా జరిగిన ఈ నాలుగవ టి-20లో ప్రత్యర్థి ఇంగ్లాండ్ పై భారత్ 15 పరుగుల తేడాతో గెలిపొందింది. దీంతో 5 టీ-20 మ్యాచ్ ల సిరీస్ లో 3-1 తేడాతో.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ ని కైవసం చేసుకుంది.
Also Read: Concussion Substitutes: ‘కంకషన్ సబ్‌స్టిట్యూట్’ అంటే ఏంటీ.. రూల్స్ వివరాలు ఇవే ?
ఈ మ్యాచ్ ముగిసినప్పటికీ భారత యువ పేసర్ హర్షిత్ రాణా {Harshit Rana} అరంగేట్రంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. ఈ మ్యాచ్ లో శివమ్ దూబే కంకషన్ గాయానికి గురి కావడంతో.. అతడి స్థానంలో సబిస్టిట్యూడ్ గా వచ్చిన హర్షిత్ రాణా తన అరంగేట్ర మ్యాచ్ లోనే అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో మూడు వికెట్లను పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం మేరకు దూబేకి బదులు హర్షిత్ రానా బౌలింగ్ కి వచ్చాడు. ఇలా భారత్ తరపున అరంగేట్రం చేసిన తొలి క్రికెటర్ గా నిలిచాడు హర్షిత్ రానా.
అయితే అతడి అరంగేట్రం పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. బ్యాటింగ్ ఆల్రౌండర్ స్థానంలో.. స్పెషలిస్ట్ పేసర్ అయిన హర్షిత్ రానా {Harshit Rana} ను ఎలా ఆడిస్తారని మాజీ క్రికెటర్లు, ఇంగ్లాండ్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఐసీసీ రూల్ 1.2.7.3.4 ప్రకారం.. కంకషన్ గాయానికి గురైన ఆటగాడి స్థానంలో అతడికి సరిపోయే ఆటగాడిని మాత్రమే బరిలోకి దించాలి. అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన దూబే స్థానంలో మరో బ్యాటింగ్ ఆల్రౌండర్ ని మాత్రమే ఆడించాలి.
కానీ టీమిండియా హర్షిత్ రానాను ఆడించడం వివాదాస్పదమైంది. ఈ మ్యాచ్ కి కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న కెవిన్ పీటర్సన్ {Kevin Pietersen} ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఈ మ్యాచ్ లో భారత్ 12 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగి విజయం సాధించిందని విమర్శించారు కెవిన్ పీటర్సన్. ” కంకషన్ సబ్ గా రావడంలో హర్షిత్ రానా తప్పేమీ లేదు. హర్షిత్ బౌలింగ్ తీరు కూడా బాగుంది. పిచ్ పరిస్థితులను అతడు సద్వినియోగం చేసుకున్నాడు. స్టమ్స్ కి దూరంగా బంతులు వేసి ఫలితం రాబట్టాడు.
Also Read: Hardik – Kohli: ధోని, కోహ్లీ రికార్డు బద్దలు.. తొలిప్లేయర్ గా పాండ్యా రికార్డు !
తుది జట్టులోకి సబిస్టిట్యూడ్ గా రావడంలో అతడి పొరపాటు ఏమైనా ఉందా..? మేనేజ్మెంట్ ఆదేశాల మేరకు అతడు ఆడాడు. కానీ సరైన కంకషన్ సబిస్టిట్యూడ్ ని దించలేదనే అసహనంతోనే జోస్ బట్లర్ అవుట్ అయ్యాడు. ఈ ప్రపంచంలో ఎవరినైనా అడగండి. డూబేకి హర్షిత్ రానా సరైన కంకషన్ సబిస్టిట్యూడ్ ప్లేయరా..? ఎవరు కూడా దీనికి అవునని చెబుతారని నేను అనుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం” అని కెవిన్ పీటర్సన్ {Kevin Pietersen} అభిప్రాయపడ్డాడు.