E-Paper
Advertisement

Anjala Zaveri: అందాల ఆడబొమ్మ .. అంజలా జావేరి గుర్తుందా.. ఆమె భర్త పెద్ద విలన్ అని తెలుసా.. ?

Anjala Zaveri: అందాల ఆడబొమ్మ .. అంజలా జావేరి గుర్తుందా.. ఆమె భర్త పెద్ద విలన్ అని తెలుసా.. ?
Advertisement

Anjala Zaveri: అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ ఈ సాంగ్ వినని వారు అంటూ ఉండరు. బాలకృష్ణ సమరసింహారెడ్డి సినిమాలో హిట్ సాంగ్. ఇందులో బాలయ్య సరసన నటించి మెప్పించిన బ్యూటీ అంజలా జావేరి. ఆమె ఒక బ్రిటిష్ నటి. 1997 లో హిమాలయ పుత్ర అనే హిందీ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక అదే ఏడాది ప్రేమించుకుందాం రా అనే సినిమాతో తెలుగుకు పరిచయమైంది.

వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ సినిమాకు అంజలాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ.. తరువాత స్టార్ హీరోలందరి సరసన నటించింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. అందరితో రొమాన్స్ చేసి అప్పట్లో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక అప్పట్లోనే ఈ బ్యూటీ అందాల ఆరబోత చేసి కుర్రకారుకు కునుకు లేకుండా చేసింది.

Advertisement

కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా స్టార్ గా మారింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే.. హిందీ నటుడు తరుణ్ అరోరా ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తరుణ్ అరోరా.. తెలుగువారికి కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైదీ నెం 150 చిత్రంతో విలన్ గా తెలుగుకు పరిచయమయ్యాడు. స్టైలిష్ విలన్ గా చిరుకు ధీటుగా తరుణ్ మెప్పించాడు. ఈ సినిమా తరువాత కాటంరాయుడు, జయ జానకి నాయక, అమర్ అక్బర్ ఆంటోని, సిటీమార్, రామబాణం, గతేడాది రిలీజ్ అయిన భోళా శంకర్ లో కూడా నటించి మెప్పించాడు.

Advertisement

అంజలా భర్త తరుణ్ అని ఇప్పటివరకు చాలామందికి తెలియదు. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన అంజలా.. హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ సినిమాల్లో క్యామియో చేసి మెప్పించింది. ఇక ఈ జంటకు పిల్లలు లేరు. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైనా.. అంజలా సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. నిత్యం భర్తతో హ్యాపీగా గడిపిన మూమెంట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. ఇంకా ఇప్పటికీ ఆమె అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా షాక్ ఇస్తుంది. మరి ముందు ముందు అంజలా తెలుగులో రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×