BigTV English

Sobhita Dhulipala: అక్కినేని కోడలు శోభితా గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. ?

Sobhita Dhulipala: అక్కినేని కోడలు శోభితా గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. ?

Sobhita Dhulipala: అక్కినేని ఇంట సంబురాలు అంబరాన్ని అంటుతున్న విషయం తెల్సిందే. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు, హీరో నాగ చైతన్య నిశ్చితార్థం హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. అక్కినేని నాగ చైతన్య, సమంత ప్రేమించుకొని 2017 లో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు కలిసిఉన్న ఈ జంట కొన్ని విభేదాల వలన 2021లో విడాకులు తీసుకొని విడిపోయారు.


ఇక విడాకుల అనంతరం.. కెరీర్ మీద ఫోకస్ చేసిన చై.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం 2022 నుంచి చై- శోభితా డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఎవరు శోభితా..? ఎక్కడ నుంచి వచ్చింది..? అని ఇప్పుడు అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.

శోభితా ధూళిపాళ్ల.. 1992, మే 31 న తెనాలిలో జన్మించింది. అచ్చ తెలుగు అమ్మాయి. తండ్రి వేణుగోపాల్ ఒక నావీ ఆఫీసర్. ఆమె తల్లి శాంత కామాక్షీ ఒక స్కూల్ టీచర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన శోభితా.. వైజాగ్ లో స్కూలింగ్ పూర్తిచేసింది. అనంతరం ఉన్నత చదువుల కోసం ముంబైకు షిఫ్ట్ అయిన శోభితా.. లా చేసింది. దీంతో పాటు కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్చుకుంది.


2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానం సొంతం చేసుకున్న శోభితా.. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొంది. ఇక మోడల్ గా ఎన్నో యాడ్స్ లో కూడా నటించి మెప్పించింది. సాధారణంగా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని సామెత. కానీ.. శోభితా రచ్చ గెలిచి ఇంట అడుగుపెట్టింది.

2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందించడంతో శోభితాకు బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందిపుచ్చుకొనేలా చేసింది. ఇక 2018 లో గూఢచారి సినిమాతో తెలుగుకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా శోభితాకు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. అయితే స్టార్ హీరోయిన్ అని చెప్పలేం కానీ.. ఆమె నటించిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకతను నిలుపుకొనేలా చేసింది.

మేజర్, కురుప్, పొన్నియన్ సెల్వన్.. ఇలా శోభితా మంచి మంచి సినిమాల్లో నటించింది. సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఆమె చేసిన వెబ్ సిరీస్ లు మరో ఎత్తు. ఆమె కెరీర్ లో గుర్తుండిపోయే సిరీస్ అంటే మేడ్ ఇన్ హెవెన్. అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్.. శోభితా లైఫ్ నే మార్చేసింది. తార పాత్రలో ఆమె నటించింది అని చెప్పడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు. దీని తరువాత బార్డ్ ఆఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ లాంటి సిరీస్ లు ఆమెకు గుర్తింపును తీసుకొచ్చిపెట్టాయి.

ఇక రిలేషన్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు ఆమెపై ఎలాంటి రిలేషన్ పుకార్లు వచ్చింది లేదు. 2022 నుంచి శోభితా.. చైతో క్లోజ్ గా ఉందని సమాచారం. చై కజిన్ సుప్రియ యార్లగడ్డ వలన శోభితా అక్కినేని కుటుంబానికి పరిచయం అయ్యిందని, అప్పటినుంచి వారి మధ్య పరిచయం.. ప్రేమగా మారి, పెళ్ళికి దారితీసిందని తెలుస్తోంది.

సామ్ తో విడాకులు, విమర్శలు, పరాజయాలు.. ఇలా కష్టాలను ఎదుర్కుంటున్న సమయంలో చై కు శోభితా అండగా నిలిచిందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ జంట ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×