BigTV English

PM Modi: పాక్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచన.. ఇది పాటిస్తే వారికి?

PM Modi: పాక్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచన.. ఇది పాటిస్తే వారికి?

PM Modi: దాయాది దేశం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పర్యాటకంగా భావిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని తొలిసారి తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కచ్‌ జిల్లాలో ప్రారంభించిన అనంతరం భుజ్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.


పాకిస్థాన్ తీరుపై ప్రధాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టెర్రరిజం పాక్ కు జీవనాధారమని అని చెప్పారు. పాకిస్థాన్ గవర్నమెంట్, అక్కడి ఆర్మీ తమ సొంత ప్రయోజనాల కోసం టెర్రరిజంకి  సపోర్ట్ చేస్తున్నారని ఫైరయ్యారు. ఈ విషయాన్ని పాక్ ప్రజలు గమనించాలని ప్రధాని సూచించారు.  మనదేశానికి చెందిన టూరిస్టులను చంపిన టెర్రరిస్టులను, ఉగ్రవాదాన్ని అంతమొదించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పాకిస్థాన్ ప్రజలు శాంతి మార్గాన్ని ఎంచుకోకపోతే.. ఇండియన్ ఆర్మీ ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సి వస్తోందని వార్నింగ్ ఇచ్చారు. రోటీలు తిని  హాయిగా బతుకుతారో.. ఇండియన్ ఆర్మీ తూటాలకు బలవుతారో తేల్చుకోవాలని చెప్పారు. నేటికి 11 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రధాని.. భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొనియాడారు.


పాక్‌ పౌరులు ఒకసారి తమ దేశం ఎక్కడ ఉందో ఆలోచించుకోవాలని ప్రధాని సూచించారు. భారత్ పర్యాటక రంగాన్ని విశ్వసిస్తుండగా.. పాకిస్థాన్‌ మాత్రం ఉగ్రవాదాన్నే పర్యాటకంగా పరిగణిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం యావత్‌ ప్రపంచానికే ప్రమాదకరమని ప్రధాని మోదీ చెప్పారు. ‘నేను పాకిస్థాన్‌ పౌరులను ఒక విషయం అడుగుతున్నా. మీరు ఏం సాధించారు? ఇవాళ భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది. కానీ మీ పరిస్థితి ఏంటో మీకు తెల్సా? టెర్రరిజంని ప్రోత్సహించిన వారు మీ ఫ్యూచర్ ను నాశనం చేస్తున్నారు. ఇప్పటికైననా ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు పాకిస్థాన్ ప్రజలు ముందుకు రావాలి. సంతోషంగా, ప్రశాంతంగా జీవించండి’ అని ప్రధాని చెప్పారు.

ALSO READ: Gold Mining: మన తెలుగు రాష్ట్రాల్లో బంగారు గనులు.. రూ.లక్షల కోట్ల నిల్వలు గుర్తింపు

శ్రీనగర్ లో పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత టెర్రరిస్టులపై పాకిస్థాన్‌ చర్యలు తీసుకుంటుందేమోనని 15 రోజుల వరకు వేచి చూశామని అన్నారు. కానీ, ఉగ్రవాదమే వారికి ఆహార అస్త్రంగా మారినట్లు కనబడిందని చెప్పారు.  ‘మే 9 రాత్రి పాకిస్థాన్‌ మన పౌరులపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో భారత సైన్యం తిరిగి దాడి చేసి పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. టెర్రరిజంపై పోరులో మన సైన్యానికి స్వేచ్ఛనిచ్చాం. మానవత్వాన్ని రక్షించడం, ఉగ్రవాదం అంతం కోసమే ఆపరేషన్‌ సిందూర్‌  చేపట్టాం’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×