BigTV English

Hero Nikhil : హీరో నిఖిల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

Hero Nikhil : హీరో నిఖిల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవాడో తెలుసా..?

Hero Nikhil : సినీ ఇండస్ట్రీలోకి హీరోలు ఎంట్రీ ఇవ్వక ముందు ఏదొక పని చేసినవారే.. కొందరు ఉద్యోగాలను వదిలి సినిమాల పై పిచ్చితో అటుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఒకటి రెండు సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. మరి కొందరు మాత్రం సక్సెస్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక కొందరేమో సినిమాల్లోకి రాక ముందు సీరియల్స్ లేదా బుల్లి తెర పై సందడి చేశారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఓ హీరో సీరియల్స్ తో కేరీర్ ను స్టార్ట్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయ్యాడు. అతను ఎవరో? ఇప్పుడు ఏం సినిమా చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..


సాదారణంగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ ను అందుకున్నారు. స్టార్ హీరోలుగా ఎదగడం అంటే అది సాధారణ విషయం కాదు. దాని వెనక ఎంతో శ్రమ, కృషి ఉంటుంది.. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చేజెక్కించుకుని ప్రేక్షకులను, దర్శకుల్ని మెప్పించాల్సి ఉంటుంది. అలా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగి టాలీవుడ్ స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో నిఖిల్ కూడా ఒకరు. అయితే నిఖిల్ సినిమాల్లో కన్నా ముందు సీరియల్స్ లో కూడా నటించాడు అని చాలా మందికి తెలియదు. మరి ఆ సీరియల్ ఏంటో చూద్దాం..

సంబరం, హైదరాబాద్ నవాబ్ సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించాడు. తర్వాత సీరియల్లో నటించే అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఈటీవీలో టెలికాస్ట్ అయినా చదరంగం సీరియల్లో కీలక పాత్రలో మెరిసాడు. ఈయనతో పాటుగా రాజీవ్ కనకాల కూడా నటించారు. అప్పట్లోనే ఈ సీరియల్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక నిఖిల్ కెరీర్‌లో నటించిన ఏకైక సీరియల్ కూడా అదే కావడం విశేషం.. ఇక శేఖర్ ఖమ్ముల సినిమా హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత.. బ్యాక్ టూ బ్యాక్ సినిమా ఆఫర్లను అందుకుంటూ మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.. కార్తికేయ 2 తో పాన్ ఇండియన్ స్టార్ట్ గా మారిపోయిన నిఖిల్.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం నిఖిల్ స్వయంభు తో మరోసారి పాన్ ఇండియా ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. హిస్టారియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి నూతన డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో నభానటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్గా కనిపించనున్నారు. ఈ మూవీకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసాయి. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత మరో రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×