Satyabhama Today Episode November 21 th : నిన్నటి ఎపిసోడ్ లో.. సంజయ్ సంధ్య ని ఫాలో అవుతూ రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ తనని చూసి అనుకోకుండా చూసాను అన్నట్టు డ్రామా మొదలుపెడతాడు. దానికి ఒక పెద్ద స్టోరీ చెప్తాడు. కానీ సంధ్య మాత్రం ఆ స్టోరీని విని అస్సలు నమ్మదు. ఇక సంజయ్ సంధ్యతో పులిహార కలుపుతాడు. ఇక రేపు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలీదు నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలియదు. అయితే మళ్లీ మనిద్దరం కలిస్తే మనల్ని విధి కలుపుతుందని అనుకోవాలి అని సంజయ్ అంటాడు . ఇక దానికి సంధ్య రేపు కలిసినప్పుడు ఆలోచిద్దాం మనల్ని విధి కలుగుతుందో లేకపోతే ఇంకేదో అనేసి వెళ్ళిపోతుంది. చక్రవర్తితో అసలు నిజం బయట పెట్టిస్తుంది సత్య.. క్రిష్ తండ్రి ఎవరు అన్న నిజాన్ని తెలుసుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య క్రిష్ అసలు తండ్రి చక్రవర్తి అని తెలుసుకుని మీరు నాకు ధైర్యం ఇవ్వకపోయినా పర్లేదు అసలు నిజానిజాలు నేను బయట పెడతాను మీ కొడుకును మీకు దగ్గర చేస్తానని సత్య సవాల్ చేస్తుంది. మహదేవయ్య ఉచ్చు నుంచి కృష్ణుని బయటపడేసి మీకు దగ్గర చేస్తాను మావయ్య అని చెప్పేసి ఇంటికి వస్తుంది. క్రిష్ మహదేవయ్య కాళ్ళు పడుతుంటాడు. ఇక మహదేవయ్య క్రిష్ కాలు పట్టడం చూసి సంబరపడిపోతుంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన సత్య ఎన్నాళ్ళు ఈ నవ్వు ఉంటుందో ఎన్నాళ్ళు సంబరపడిపోతావో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది. కృష్ణను చిన్న మామయ్యకి దగ్గర వరకు నేను నిద్ర పోను అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది.. ఇక లోపల జయమ్మ సోఫాలో కూర్చొని ఉంటుంది. సంజయ్ సాంగ్స్ పెట్టుకొని డాన్స్ వేసుకుంటూ కిందకి వస్తాడు. జయమ్మ ఆగరా నీకోసం ఉదయం నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నానని అడుగుతుంది.
పొద్దున్నే మొదలు పెట్టావా ఏంటి చెప్పు గ్రానీ అని సంజయ్ అడుగుతాడు. ఏంటో గుర్తుందా అనేసి అడగగానే రేపు సండే కదా అని సంజయ్ అంటాడు. సండే కాదురా రేపు ఒక స్పెషల్ రోజు ఉంది కనీసం గుర్తు లేదంటే ఓ నీ పుట్టినరోజు 80 ఏళ్ల క్రితం పుట్టావు హ్యాపీ బర్త్డే గ్రానీ అనేసి అంటాడు. జయమ్మ నా బర్తడే కాదురా రేపు మీ నాన్న బర్తడే కనీసం నీకు గుర్తు కూడా లేదా అనేసి అడుగుతుంది. చిన్నప్పుడు అంటే స్కూల్లో చాక్లెట్లు పని చేయాలని ఇంత పెద్ద వయసులో జుట్టు నిరసన వయసులో బర్త్డే చేసుకోవాలి గ్రాని నాకు అసలే అవతల చాలా పనులు నేను వెళ్ళిపోతున్నాను అనేసి వెళ్ళిపోతాడు. ఇంకనయం వీడి మాటలు వీళ్ళ నాన్న వెళ్ళలేదు లేకున్నా అంటే చిన్నోడు ఎంత బాధ పడేవాడు అని జయమ్మ అనుకుంటుంది. సంజయ్ మాట్లాడిన మాటలు అన్నీ బయటనుంచి చక్రవర్తి వింటాడు. సంజయ్ ఇన్ని రోజులు పెంచితే ఇదే నా విలువిచ్చేదని మనసులో బాధపడుతుంటాడు.
వెనకాలే సత్య వచ్చి ఏంటి చిన్న మామయ్య నీ కొడుకా అలా అనడం విని బాధపడుతున్నావా నువ్వు పెంచింది గులాబీ మొక్కని కాదు గులాబీలు పూయడానికి, నువ్వు పెంచింది ఒక కలప మొక్కని అని గుర్తుపెట్టుకో అనేసి అంటుంది. అతనికి ప్రేమ విలువలు ఉంటాయని మీరు ఆశపడకండి అనేసి అంటుంది సత్య. రేపు మీ బర్త్డే ని ఎంత గ్రాండ్ గా మీ సొంత కొడుకు జరిపిస్తాడు మీరే చూస్తారు గానేసి సత్య అనేసి వెళ్తుంది. ఇక నందిని హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. హర్ష వాళ్ళ బామ్మ దగ్గరికి వచ్చి ఎలా ఉందనే ముసలి అని అడుగుతుంది. అలా రెడీ అవ్వకుంటే ఇలా నీట్ గా రెడీ అవ్వచ్చు కదా అనేసి నందిని అంటుంది. నందిని భార్య అందాన్ని అవకాశం ఎత్తులో ఉంచాలి భర్త దాని అందుకోవడానికి చూడాలి అప్పుడే మజా ఉంటుంది అనేసి అంటుంది. నందిని మాటలు విని భామ్మ మురిసిపోతుంది. ఇక మైత్రి హర్ష ఆఫీస్ నుంచి ఇలానే వస్తాడు నన్ను ఆక్సిడెంట్ అయిందని మనుషుల్ని మాట్లాడిపెడుతుంది. రావడం చూసి ప్లాన్ ని అప్లై చేస్తుంది. కాలుకు గట్టిగా తగిలిందని నన్ను ఇంటికి తీసుకెళ్లమని అడుగుతుంది. ఇక మైత్రి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది. హర్ష తనని ఇంటికి తీసుకెళ్లి డాక్టర్ కి చూపిస్తాడు. డాక్టరు ఆమె రెండు రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తుంది. ఇతను మీ ఆయనే కదమ్మా అంటే కాదండి అతను నా ఫ్రెండ్ అనేసి మైత్రి అంటుంది. ఫోన్ చేస్తే మైత్రికి యాక్సిడెంట్ అయిందని చెప్తాడు దాంతో నందిని కోపంతో రగిలిపోతుంది.
క్రిష్ ను బయటకు వెళ్తుంటే సత్య ఆపుతుంది. వాళ్ళిద్దరి మధ్య కాస్త రొమాంటిక్ కన్వర్జేషన్ జరుగుతుంది. సత్య మీ బాబాయి అంటే నీకు చాలా ఇష్టం కదా అనేసి అడుగుతుంది. ఆయన బర్త్డే నువ్వు ఎలా చేస్తావో నీ ఇష్టం నీకు అవసరానికి నువ్వు కష్టపడకూడదని ఒకటి కాదు రెండు కాదు ఐదు కోట్లు ఇచ్చాడు అని అంటుంది. జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనంతగా చేస్తాననేసి అంటాడు. ఇక చక్రవర్తి నిద్రపోతుంటే క్రిష్, సత్య జయమ్మ కలిసి అతని దగ్గరికి వెళ్లి బర్త్ డే శుభాకాంక్షలు చెప్తారు. చక్రవర్తి కొడుకు శుభాకాంక్షలు చెప్పడంతో ఎమోషనల్ అవుతాడు. ఇక చక్రవర్తికి తెలియకుండా బర్త్డే పార్టీని అరేంజ్ చేస్తారు క్రిష్.. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో మహాదేవయ్య భార్య అంటూ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె ఎవరో అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..