Maruthi: ప్రముఖ డైరెక్టర్ మారుతి (Maruthi). ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన పేరే వినిపిస్తోంది. కారణం ‘ది రాజా సాబ్’ టీజర్ అని చెప్పాలి. గతంలో ప్రభాస్ (Prabhas) తో మారుతి సినిమా చేస్తున్నారు అని ప్రకటించినప్పటి నుంచి అభిమానులలో చాలా వ్యతిరేకత నెలకొంది. ఈ సినిమాతో ప్రభాస్ డిజాస్టర్ చవిచూస్తాడు అని చాలామంది కామెంట్లు చేశారు. కానీ అప్పుడప్పుడు ఈ సినిమా నుండి విడుదలైన లీక్ ఫోటోలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. దీనికి తోడు ఇప్పుడు టీజర్ విడుదలవ్వడంతో మారుతి తన మార్క్ చూపించేశారు. సినిమా నుండి టీజర్ విడుదల చేయగా ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 5న విడుదల చేయబోయే సినిమా కోసం అభిమానులు అప్పుడే ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇక దీన్ని బట్టి చూస్తే మారుతి తన డైరెక్షన్ తో ఎలా మ్యాజిక్ చేయబోతున్నారో అర్థం చేసుకోవచ్చు.
మా నాన్న ఇక్కడే అరటిపళ్ళు అమ్మేవారు – మారుతి
ఇకపోతే ఈ టీజర్ ను మొదట థియేటర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ పంచుకున్నారు మారుతి. అంతేకాదు ఈ పోస్టు ద్వారా తాను ఇండస్ట్రీలోకి రాకముందు ఎలాంటి పనులు చేసే వాడిని అనే విషయాలు కూడా తెలియజేశారు.. “మచిలీపట్నం – సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్ కాంప్లెక్స్) . ఒకప్పుడు మా నాన్న ఇక్కడే చిన్న దుకాణం పెట్టుకుని అరటిపళ్ళ వ్యాపారం చేసేవారు. ఇక సినిమాల్లోకి అడుగు పెట్టాలనే కోరికతో నేను ఇక్కడే విడుదలైన అందరి హీరోల బ్యానర్ లను సిద్ధం చేసేవాడిని. ఒక్కసారి మన పేరు కూడా ఇక్కడ చూడాలి అని నేను ఎన్నో కలలు కన్నాను. ఈరోజు అదే కాంప్లెక్స్ వద్ద నిలుచుకొని నా ప్రయాణం ఎక్కడ మొదలైందో గుర్తు చేసుకుంటే జీవితం ఇక పరిపూర్ణం అయింది అనిపిస్తోంది.
నా కల నెరవేరింది – మారుతి
ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంద. ఇంతకుమించి నాకేం కావాలి. ఈరోజు మా నాన్న గనుక ఉండుంటే ఎంతో గర్వపడేవారు. ఆయనను నేనెప్పుడూ ఎంతో మిస్ అవుతున్నాను. మీరందరూ నాపై చూపించిన దయకు, అభిమానానికి, ధన్యవాదాలు. ముఖ్యంగా ఉన్న సమయంలోనే మన బాధ్యతను నెరవేర్చాల్సి ఉంది. ఏ విధంగా అయితే నేను ప్రభాస్ ని చూపించాలని ఆశపడ్డానో.. ఆ విధంగానే మీ అందరికీ చూపించనున్నాను.. మీ అందరి ఆశీస్సులు కావాలి” అని మారుతి అన్నారు. ఇక ప్రస్తుతం మారుతి చేసిన కామెంట్లు వింటుంటే ఆయన కల నెరవేరిందని తెలుస్తోంది. ఇక అంతే కాదు ఇండస్ట్రీలోకి రాకముందు హీరోల బ్యానర్లు కట్టేవాడు అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సక్సెస్ అంటే ఇది అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
also read: Sarkaar 5 Promo: ఏ రోజు నన్ను నిద్రపోనిచ్చావు సుధీర్? ఆ విషయం బయటపెట్టేసిన అరియానా, ఆటగాడే!
ది రాజా సాబ్ సినిమా విశేషాలు..
ది రాజా సాబ్ సినిమా విషయానికి వస్తే రొమాంటిక్ హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ.జీ.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తుండగా ఆయనకు.. జోడిగా నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిద్ధి కుమార్ (Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సంజయ్ దత్ (Sanjay Dutt)పాటు సప్తగిరి (Saptagiri), వీటీవీ గణేష్ (VTV Ganesh) వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ నటించిన తొలి హార్రర్ సినిమా కావడంతో సినిమా కోసం అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తున్నారు.
MACHILIPATNAM – Siri complex (krishna Kishore in past)
This is the place where my father once had a small banana stall…
Where I used to write for banners of all heroes films released in this theater dreaming with hope 🙂I was one of those who wished “okkasaraina mana peru… pic.twitter.com/Wnu3cCUoOz
— Director Maruthi (@DirectorMaruthi) June 16, 2025