BigTV English

The Raja saab : రెండు పార్ట్‌లుగా రాజా సాబ్… వామ్మో డార్లింగ్‌ను అసలేం చేయాలనుకున్నారు ?

The Raja saab : రెండు పార్ట్‌లుగా రాజా సాబ్… వామ్మో డార్లింగ్‌ను అసలేం చేయాలనుకున్నారు ?

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)త్వరలోనే మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ది రాజా సాబ్ (The Raja Saab) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రభాస్ ఇలాంటి పాత్రలలో నటించి చాలాకాలం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరన డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలియజేశారు.Prabhas  ఇక తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ టీజర్ అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్ చూసి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


బాహుబలి సినిమాతో ట్రెండ్…

ఇకపోతే ఈ సినిమా గురించి తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల కాలంలో ఒక సినిమా రెండు భాగాలుగా(Two Parts) రావడం అనేది కొత్త ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు నటిస్తున్న సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. నిజం చెప్పాలంటే ఇలాంటి సీక్వెల్స్ కు బీజం వేసింది కూడా ప్రభాస్ అనే చెప్పాలి. ఈయన హీరోగా నటించిన బాహుబలి (Bahubali)సినిమా ఎప్పుడైతే రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందో ఆ తర్వాత ప్రతి ఒక్క సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.


రాజా సాబ్ రెండు భాగాలు…

ఇక ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా నుంచి మొదలుకొని సలార్, కల్కి వంటి సినిమాలు కూడా సీక్వెల్స్ రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమాని కూడా రెండు భాగాలుగా చేయాలని నిర్మాతలు భావించినట్టు తాజాగా ఈ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మొదట్లో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారట. అయితే చిత్ర బృందం మొత్తం ఈ విషయంపై చర్చలు జరిపి సీక్వెల్ లేకుండా ఒకే సినిమాగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

పాన్ ఇండియా ప్రాజెక్టులు…

ఈ సినిమా నిడివి రెండున్నర గంటలకంటే ఎక్కువగా ఉన్న సమయంలోనే రెండు భాగాలుగా చేయాలని భావించారు కానీ ఈ సినిమాని మూడు గంటలకు కుదించి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ భావించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా రన్ టైం గురించి కూడా తాజాగా డైరెక్టర్ మారుతి తెలియజేశారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సినిమా ఉంటుందని ఈయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా చేయాలనుకున్నారనే విషయం బయటకు రావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తనతో ఒక్కో సినిమాని రెండు భాగాలుగా చేస్తున్నారు. అసలు మా హీరోని ఏం చేయాలనుకుంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ స్పిరిట్, ఫౌజి, కల్కి 2, సలార్ 2 సినిమాలకు కమిట్ అయిన విషయం తెలిసిందే.

Related News

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Big Stories

×