Rishab Shetty : కన్నడ స్టార్ హీరో రిషప్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాల అవసరం లేదు.. కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా వరుస సినిమాలు తెర కెక్కిస్తున్న ఈయన ఈమధ్య కాంతారా సినిమా తో ప్రేక్షకుల ముందుకి ఎంట్రీ ఇచ్చాడు. హీరో గా కూడా తన సత్తాని చాటి, బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాల తో వేసుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సృష్టించడంతో పాటుగా ఎన్నో అవార్డులు రివార్డులను అందించింది. ఆ సినిమాకు సీక్వెల్ గా కాంతారా 2 రూపోందుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ డైరెక్టర్ గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలియదు. నిన్ను నమ్మలేని విషయాలు ఈ డైరెక్టర్ జీవితంలో జరిగాయని తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఒక ముందు ఈ డైరెక్టర్ ఏం చేసేవాడు అని చాలామందికి తెలుసుకోవాలి అనే ఆత్రుత ఉంటుంది. అదేవిధంగా గూగుల్లో ఆయన అభిమానులు ఎక్కువగా వెతికిస్తున్నారు. రిషబ్ శెట్టి సినిమాలకు రాకముందు ఏం చేసాడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
రిషబ్ శెట్టి కెరీర్..
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి గురించి అందరికి తెలుసు.. ఎన్నో చిత్రాలకు డైరెక్టర్ గా పలు సినిమాలు చేశాడు.రిషబ్ శెట్టి నటించి డైరెక్షన్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గీత ఆర్ట్స్ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను దాదాపు 16 కోట్ల తో తెరకెక్కించగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. కన్నడ లో ఈ మూవీ భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ మూవీ అప్పటిలో కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. రిషబ్ మొదటి నుంచి సినిమాల్లో లేరు. అయన సినిమాలకు ముందు ఏం చేసేవాళ్ళో తెలుసుకోవాలని రిషబ్ ఫ్యాన్స్ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. ఏం చేసేవారంటే..
సినిమాల్లోకి రాకముందు…
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి డబ్బులు కోసం అనేక పనులు చేస్తుండేవాడు. నాన్నను డబ్బులు అడగలేక చిన్నచిన్న పనులు చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నించానని తెలిపారు. కూలి పనికి వెళ్లడం అక్కడ వచ్చిన డబ్బుల తో సినిమా చూసే వాడినని అన్నారు.. అలాగే 2004 నుంచి 2014 వరకు మినరల్ వాటర్ ప్లాంట్ లో వాటర్ క్యాన్లు అమ్ముతూ డబ్బులు సంపాదించానని తెలియజేశారు. దీని తర్వాత పలు హోటల్స్ లో పని చేశానని.. ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ సినిమాల్లో ఛాన్స్ కోసం ట్రై చేశానని తెలియజేశారు. లైట్ బాయ్, అసిస్టెంట్, డైరెక్టర్, చివరికి హీరో అయ్యాడు.. అలా ఇప్పుడు వరుస అవార్డులు అందుకున్నాడు. ప్రస్తుతం ఈ కాంతారా మూవీకి సీక్వెల్ గా రాబోతున్న మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. అలాగే మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. ఇక తెలుగులో హనుమాన్ మూవీకి సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆంజనేయ స్వామి పాత్రలో నటిస్తున్నాడు..