OTT Movie : రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఓటీటీ మూవీ లవర్స్. ‘పొలిమేర’ దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఒక మూవీ, రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. మంచి ట్విస్ట్ లతో, సస్పెన్స్ తో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
కార్తీక్ మెడికల్ కాలేజీలో చదువుతూ అంజలితో ప్రేమలో పడతాడు. వీరిద్దరూ ప్రేమించుకున్నప్పటికీ, అంజలి కుటుంబం వీరి పెళ్ళికి ఒప్పుకోదు. దీంతో వీరు పెద్దలను ఎదిరించి, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అయితే అంజలికి ఒక అరుదైన వ్యాధి ఉంటుంది. ఆమె శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ 28 డిగ్రీ సెల్సియస్‌లోనే ఉండాలి, లేకపోతే ఆమె ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ పరిస్థితి వల్ల ఆమె చల్లని వాతావరణంలో వుండలేదు. అలాగని వేడి వాతావరణంలో కూడా ఉండలేదు. ఒక్క గ్లాసు వేడి కాఫీ తాగినా ఆరగంటలోనే చనిపోయే ప్రమాదం ఉంటుంది. కార్తీక్, అంజలిని కాపాడటానికి, వైద్యం కోసం ఆమెను జార్జియాకు తీసుకెళ్తాడు. అక్కడ ఆమె సమస్యకు చికిత్స అందుబాటులో ఉంటుంది. జార్జియాలో కార్తీక్ సర్జన్‌గా పని చేస్తూ, అంజలి ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు.
అయితే ఒక రోజు హఠాత్తుగా అంజలి తీవ్రమైన చలి వాతావరణంలో మరణిస్తుంది. అదే సమయంలో, గీత అనే మరో ఎన్ఆర్ఐ మహిళ మృతదేహం కూడా కనిపిస్తుంది. అక్కడే కార్తీక్ తీవ్రంగా గాయపడిన స్థితిలో ఉంటాడు. అంజలి చనిపోయిన తరువాత ఆమె ఆత్మ రూపంలో కార్తీక్ కి కనబడుతూ ఉంటుంది. ఆ తరువాత ఒక పోలీసు అధికారి ఈ కేసును దర్యాప్తు చేస్తాడు. అంజలి మరణం వెనుక రహస్యం ఏమిటి? గీత ఎవరు? కార్తీక్ ఈ మరణాలకు కారణమా? అంజలి చనిపోయినప్పుడు జరిగిన షాకింగ్ నిజం ఏమిటి? ఆమె నిజంగానే ఆత్మ రూపంలో వచ్చిందా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : మొగుడు, పెళ్ళాం మధ్యలో అత్త … ఓటీటీలో అదరగొడుతున్న మలయాళ ఫ్యామిలీ ఎంటర్టైనర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ’28 డిగ్రీ సెల్సియస్’ (28 Degree Celsius). 2025 ఏప్రిల్ 4న వచ్చిన ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో నవీన్ చంద్ర, షాలిని వడ్నికట్టి ప్రధాన పాత్రలు పోషించారు. వివా హర్ష, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.