BigTV English

OTT Movie : భర్త ఆర్మీలో బిజీగా ఉంటే … ఊరిలో ఉన్న భార్య ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది.?

OTT Movie : భర్త ఆర్మీలో బిజీగా ఉంటే … ఊరిలో ఉన్న భార్య ప్రెగ్నెంట్ ఎలా అవుతుంది.?

OTT Movie : ఓటిపి ప్లాట్ ఫామ్ లోకి రకరకాల కథలతో సినిమాలు వస్తున్నాయి. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ్ మూవీ సస్పెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రెగ్నెంట్ మహిళ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బర్త్‌మార్క్’ (BirthMark). 2024 లో వచ్చిన ఈ తమిళ్ సస్పెన్స్ మూవీకి విక్రమ్ శ్రీధరన్ దర్శకత్వం వహించారు.  ఈ తమిళ భాషా థ్రిల్లర్ డ్రామా మూవీలో షబీర్ కల్లరక్కల్, మర్నా మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. సేపియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై విక్రమ్ శ్రీధరన్, శ్రీరామ్ శివరామన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్మీ ఉద్యోగి భార్యను వదిలి డ్యూటి కి వెళ్ళాక, ఆమె ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమెకు ఆతరువాత వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

డేనియల్, జెన్నీఫర్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరూ పిల్లలు కావాలని కలలు కంటారు. ఇంతలోనే డేనియల్ కి అర్మి నుంచి పిలుపు వస్తుంది. ఇతను ఆర్మీ ఉద్యోగి కావడంతో డ్యూటీకి తప్పక వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత బాధగా అక్కడ నుంచి భార్యను వదిలి వెళ్ళిపోతాడు. ఏడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాడు. అప్పటికే జెన్నీఫర్ ఏడు నెలల గర్భవతిగా ఉంటుంది. తన భార్యకి సాధారణ డెలివరీ కోసం, ఆమెను ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్తాడు. అయితే ఆ ప్రాంతం చాలా మిస్టరీగా ఉంటుంది. వాళ్ళందర్నీ చూసి జెన్నీఫర్ చాలా భయపడుతుంది. భర్త సర్ది చెప్పడంతో, ఆమె అక్కడ ఉండటానికి ఒప్పుకుంటుంది. డానియల్ ఒక రకమైన డిప్రెషన్ తో బాధపడుతూ ఉంటాడు. ఇతనికి ఆర్మీలో చేదు అనుభవాలు ఉంటాయి. మరోవైపు బిడ్డకు ప్రమాదం ఉందని ఒక మంత్రసాని చెప్తుంది.

అందులోనే జెన్నీఫర్, భర్త రాసిన ఒక డైరీ ని చదువుతుంది. అందులో ఉన్న మేటర్ చూసి జెన్నీఫర్ షాక్ అవుతుంది. ఆ డైరీలో ఈ బిడ్డ నా బిడ్డ కాదని చాలాసార్లు రాసి ఉంటుంది. అప్పుడు జర్నీ ఫర్ కి అనుమానం వస్తుంది. తన భర్త కావాలనే ఇక్కడికి తీసుకొచ్చి, నా బిడ్డను చంపే ప్రయత్నం చేస్తున్నాడని అనుకుంటుంది. చివరికి జెన్నీఫర్ కి నార్మల్ డెలివరీ అవుతుందా? భర్త డైరీలో ఎందుకు అలా రాసుకుంటాడు? ఆర్మీలో ఇతనికి ఎదురైన చేదు అనుభవాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బర్త్‌మార్క్’ (BirthMark) అనే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×