Actress Mahalakshmi: యాక్ట్రెస్ మహాలక్ష్మి(Actress Mahalakshmi).. కోలీవుడ్ నిర్మాత రవీందర్ (Ravinder)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. రవీందర్ భారీ కాయాన్ని చూసి ప్రతి ఒక్కరు హేళన చేశారు. డబ్బు కోసమే అతడిని వివాహం చేసుకుందని చాలామంది విమర్శలు గుప్పించారు. అంతేకాదు వీరిద్దరూ విడిపోయారని ఎన్నో రూమర్లు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే వాటన్నింటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నా.. రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉండగా ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తాజాగా నటించిన చిత్రం డ్రాగన్(Dragon ) ఈ సినిమాతో నటుడిగా రవీందర్ కు మరొకసారి మంచి పేరు లభించింది. అంతేకాదు దీంతో రవీందర్ పేరు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ డ్రాగన్ సినిమాలో ఫేక్ సర్టిఫికెట్లు సరఫరా చేసే వ్యక్తిగా కనిపించాడు. పలు చిత్రాలకు గతంలో నిర్మాతగా వ్యవహరించిన ఈయన ఇప్పుడు ‘డ్రాగన్’ సినిమా తనకు మంచి పేరు అందించిందని సంతోషం వ్యక్తం చేశారు.
నమ్మినవారే వెన్నుపోటు పొడిచారు – మహాలక్ష్మి
ఇకపోతే చాలా రోజుల తర్వాత ఒక సినిమాతో మంచి పేరు దక్కించుకున్న రవీందర్, తన భార్య మహాలక్ష్మితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే రవీందర్ భార్య మహాలక్ష్మి మాట్లాడుతూ.. తమకు నమ్మిన వారే వెన్నుపోటు పొడిచారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మహాలక్ష్మి మాట్లాడుతూ..” మేము నమ్మిన వ్యక్తులే మాకు వెన్నుపోటు పొడిచారు. మాతో సన్నిహితంగా ఉంటూనే, మా వినాశనం కోరుకున్నారు. ఎప్పుడైతే మనం ఇతరులను సర్వస్వం వారే అని నమ్ముతామో, వాళ్లే మనకు వెన్నుపోటు పొడుస్తారు. శత్రువు కూడా అలాంటి పని చేయడు. మనతో పాటు ఉండి, మన గురించి బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే మనల్ని మోసం చేస్తారు. జీవితంలో అమ్మా,నాన్న, భర్త, పిల్లల్ని తప్ప ఎవరిని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది”అంటూ బాధపడింది మహాలక్ష్మి. ఇకపోతే కొద్ది రోజుల క్రితం ఆర్థిక లావాదేవీల విషయంలో రవీందర్ జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. ఇక నమ్మిన వ్యక్తి తమకు ఇలాంటి పరిస్థితిని కలిగించారని, గతంలో కూడా ఒకసారి చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని చెప్పడంతో వీరికి ఎవరో బాగా కావాల్సిన వాళ్లే ఈ పని చేసి ఉంటారని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
మేము విడిపోలేదని నిరూపించుకోవడానికి కష్టపడుతున్నాం -రవీందర్..
ఇక రవీందర్ మాట్లాడుతూ..” మా పెళ్లి తర్వాత మమ్మల్ని చూసి చాలామంది నవ్వుకున్నారు. ఇంత అందమైన స్త్రీ అంత శరీరాకృతి ఉన్న వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంది? ఈ పెళ్లి ఎన్ని రోజులు ఉంటుందిలే.. అంటూ ఎంతోమంది హేళన చేశారు. కొందరైతే మేము విడాకులు తీసుకొని విడిపోయామని ప్రచారాలు చేశారు. ఇలాంటి వార్తలు వచ్చిన ప్రతిసారి కూడా మేము కలిసి ఉన్నాము అంటూ ఫోటోలు పోస్ట్ చేస్తూ.. రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అయినా ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. కొందరు చేస్తున్న హేళనను చూసి తట్టుకోలేక ఎన్నో సార్లు ఫోటోలు షేర్ చేస్తూ బ్రతుకుతున్నాము” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రవీందర్. ప్రస్తుతం ఈ జంట చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.