BigTV English

Trump Govt: ట్రంప్ కొత్త ఆఫర్.. పౌరసత్వం కోసం గోల్డ్ కార్డ్

Trump Govt: ట్రంప్ కొత్త ఆఫర్.. పౌరసత్వం కోసం గోల్డ్ కార్డ్

Trump Govt: అమెరికాకు ఆదాయాన్ని సమకూర్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది ట్రంప్ సర్కార్. అక్రమ వలసదారులు, వీసాల వ్యవస్థలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తెరపైకి ‘గోల్డ్ కార్డు’ వ్యవస్థను తీసుకురావాలని భావిస్తోంది. దీనివల్ల అమెరికా పౌరసత్వమేకాదు, ప్రభుత్వా నికి ఆదాయం కూడా సమకూరుతుంది. సింపుల్‌గా తెలుగులో చెప్పాలంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నమాట.


ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంపన్న వలసదారులు అందరికీ శుభవార్త. అమెరికాలో పౌరసత్వం కావాలనుకునేవారికి కొత్త ఆఫర్‌ ప్రకటించారు. EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్ ప్లేస్‌లో ‘గోల్డ్ కార్డ్’ వీసాను ఇవ్వబోతున్నట్లు చెప్పారు. దీన్ని పొందాలనుకునేవారు ఐదు మిలియన్ల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల అమెరికా దేశ ఆదాయం పెరుగుతుందని చెప్పారు.


గోల్డ్ కార్డు వల్ల ఉపయోగాలు

మూడున్నర దశాబ్దాలుగా అమెరికాలో అమల్లో ఉంది EB-5 ఇమ్మిగ్రెంట్ ఇన్వెస్టర్ వీసా. దీనివల్ల మోసాలు, అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. వాటకి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. EB-5 వీసా స్థానంలోకి గోల్డ్ కార్డ్ వీసాను తీసుకొస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేశారు. దీనికోసం 5 మిలియన్ల డాలర్లు చెల్లించి వీసాను సొంతం చేసుకోవచ్చని వివరించారు. దీన్ని పొందినవాళ్లు అమెరికాలో మరింత ధనవంతులు అవుతారన్నది ట్రంప్ మాట.

గోల్డ్ కార్డ్ వీసా వల్ల వినియోగదారులకు అనేక లబ్ది చేకూరుతుందన్నది ఆయన ఆలోచన. దీనివల్ల ప్రభుత్వానికి భారీగా పన్నులు రానున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే గోల్డ్ కార్డు దారుల వల్ల దేశం రుణం క్రమంగా తగ్గుతుందన్నది ప్రభుత్వం అంచనా. ఓ మిలియన్ గోల్డ్ కార్డ్‌ల వల్ల 5 ట్రిలియన్ల డాలర్లు వస్తాయన్నది ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తాము భావించిన దానికంటే ఎక్కువ మంది వీటిని తీసుకుంటే మరింత ఆదాయం ప్రభుత్వానికి సమకూరనుంది.

ALSO READ: ట్రంప్ దబిడి దిబిడి.. కెనడా, మెక్సికోపై సుంకాలు అమలు అప్పుడే

మరో రెండు వారాల్లో EB-5 వీసాలను ట్రంప్ గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తామన్నారు అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లట్ని. ఇది శాశ్వత నివాస హోదా కల్పించే గోల్డ్ కార్డు అని చెప్పారు. చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఉపయోగపడుతుందని వివరించారు.

గ్రీన్‌కార్డు వ్యవస్థకు ఫుల్‌స్టాప్

EB-5 వీసా విధానాన్ని 1990లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. 2021 నుంచి 2022 సెప్టెంబర్ వరకు 8 వేల మంది ఇన్వెస్టర్ ఆ తరహా వీసాలను పొందినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మోసాల జరగడం వల్ల దీని స్థానంలో ‘గోల్డ్’ కార్డ్ వీసాలను అందుబాటులోకి తీసుకురానుంది ట్రంప్ సర్కారు.

పెట్టుదారుల కోసం వీసాలు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నాయి. యూకె, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు ఇలాంటి స్కీమ్ లు పెట్టాయి.  100 కంటే ఎక్కువ దేశాలు ‘గోల్డెన్ వీసా’ పథకాన్ని ప్రవేశపెట్టాయి. ఈ విషయాన్ని పెట్టుబడి వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్టనర్స్ వెల్లడించింది.

గోల్డ్ కార్డ్ వీసాను అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతి అవసరం లేదన్నది ట్రంప్ ఓపెన్‌గా వెల్లడించారు. EB-5 వీసాల జారీకి కొంత పరిమితి ఉండగా, కొత్త‌దానిపై ఎలాంటి పరిమతి ఉండదని చెప్పుకొచ్చారు. గోల్డ్‌కార్డు వల్ల దశాబ్దాల నాటి గ్రీన్‌కార్డ్ వ్యవస్థను అంతం కానుందన్నమాట.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×