BigTV English

Anil Ravipudu: పెళ్ళాం మీద సినిమా చేయడం కాదు.. అది నేర్చుకో అనీల్ పరువు తీశారుగా?

Anil Ravipudu: పెళ్ళాం మీద సినిమా చేయడం కాదు.. అది నేర్చుకో అనీల్ పరువు తీశారుగా?

Anil Ravipudi: టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudu) ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఈయన జీ తెలుగులో ప్రసారమవుతున్న డ్రామా జూనియర్స్ (Drama Juniors)కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడితో పాటు మరొక జడ్జిగా సినీనటి రోజా (Roja)వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు తమ అద్భుతమైన స్కిట్లతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.


ఫాదర్స్ డే స్పెషల్…

ఫాదర్స్ డే స్పెషల్ కావడంతో ఈ కార్యక్రమంలో రోజా భర్త, కుమారుడు కూడా పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా ఓ కుర్రాడు భర్త పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. నేను ఒక మగాన్ని అంటూ కుర్రాడు తన స్కిట్ ప్రారంభించారు. తన ముందు ఆడవాళ్ళందరూ చాలా వినయంగా నడుచుకుంటూ ఉన్నారు. ఎందుకు ఆడవాళ్లు మీ ముందు చెప్పులు వదిలేసి వంగి వెళుతున్నారు అంటూ అనిల్ రావిపూడి అడగగా మగతనం అంటూ ఆ కుర్రాడు డైలాగులు చెబుతాడు.


కండలు పెంచడం కాదు… భయం పెంచాలి..

ఇక సుధీర్ సరిగా చూడు ఇక్కడ మేము కూడా మగాళ్ళమే అంటూ మాట్లాడటంతో కండలు పెంచడం మగతనం కాదు.. పెళ్ళాం గుండెలో భయాన్ని పెంచేవాడు మగాడు అంటూ మాట్లాడుతాడు. అంతలోపు రోజా అక్కడికి తన భార్య పాత్రలో కాఫీ తీసుకొని వస్తుంది. పక్కనే ఒక అమ్మాయి మీ ఆయన అంటూ అడగడంతో కాదు తనే నా భార్య అంటూ డైలాగ్ వేస్తాడు. అక్కడే ఉన్న అనిల్ రావిపూడిని ఉద్దేశించి మాట్లాడుతూ అనిల్ గారు “పెళ్ళాం మీద సినిమాలు చేయటం కాదు… పెళ్ళానికి సినిమా చూపించడం” నేర్చుకోండి అంటూ సెటైర్లు వేయడంతో వెంటనే అనిల్ రావిపూడి నన్నిలా తగులుకున్నాడు ఏంట్రా బాబు అంటూ మాట్లాడుతారు.

ఇలా ఈ చిన్నారి అనిల్ రావిపూడిపై సెటైర్లు వేయడంతో ఈ ప్రోమో కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ పూర్తి ఎపిసోడ్ ఈ శనివారం ప్రసారం కాబోతోంది. ఇటీవల వెంకటేష్ హీరోగా “సంక్రాంతికి వస్తున్నాం” అనే సినిమా తీసిన సంగతి మనకు తెలిసిందే.ఈ ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ భార్య మాట వినే భర్తగా, భార్యకు భయపడుతూ ఉండే భర్త పాత్రలో నటించారు. ఈ సినిమాని దృష్టిలో పెట్టుకొని ఆ కుర్రాడు అనిల్ రావిపూడి పై తనదైన శైలిలోనే సెటైర్లు వేసారని తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రోమో చాలా హాస్యాస్పదంగా అందరిని ఆకట్టుకుంటుంది. ఇక అనిల్ రావిపూడి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది .

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×