BigTV English

OTT Movie : బొగ్గు గనిలో భీకర పోరాటం… బ్లడ్ బాత్ ను తలపించే హారర్ సీన్స్ .. ఈ సినిమాను ఊపిరి బిగబట్టి చూడాల్సిందే

OTT Movie : బొగ్గు గనిలో భీకర పోరాటం… బ్లడ్ బాత్ ను తలపించే హారర్ సీన్స్ .. ఈ సినిమాను ఊపిరి బిగబట్టి చూడాల్సిందే

OTT Movie : ఒక బొగ్గు గనిలో భీకరమైన పేలుడు జరిగి గని కూలిపోతుంది. అక్కడ ఒక రహస్యమైన జీవి ఛాయలు కనిపిస్తాయి. ఇది జరిగిన ఒక శతాబ్దం తర్వాత ఫ్రాన్స్‌లోని ‘డెవిల్స్ ఐలాండ్’ అని పిలిచే అత్యంత ప్రమాదకరమైన గనిలో అమీర్ అనే ఒక యువకుడు, డబ్బు సంపాదించే ఆశతో పని మొదలుపెడతాడు. అతని బృందం విలువైన శిలాజాల కోసం గని లోతుల్లోకి వెళ్తుంది. అయితే ఒక భీకరమైన భూకంపం వారిని గనిలో చిక్కుకునేలా చేస్తుంది. ఆ చీకటిలో వాళ్ళకు ఒక పురాతన సమాధి కనబడుతుంది. అక్కడ నుండి ఒక రక్తపిపాసి మేల్కొంటుంది. ఈ జీవి ఒక్కొక్కరినీ భయాంకరగా వేటాడుతుంది. అక్కడ బయటపడే మార్గం లేకపోవడంతో, అమీర్ అతని బృందం ఈ భయంకరమైన జీవి నుండి తప్పించుకోగలరా ? లేక ఈ గని వాళ్ళకు సమాధిగా మారుతుందా? ఈ సినిమా పేరు ఏంటి ? ఎందులో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీ లోకి వెళితే

ఈ స్టోరీ 1856లో ఫ్రాన్సులోని పాస్-ద-కలైస్ ప్రాంతంలోని ఒక కోల్ మైన్‌లో జరుగుతుంది. దీనిని ‘డెవిల్స్ ఐలాండ్’అని పిలుస్తారు. ఎందుకంటే ఇది దేశంలోని అత్యంత ప్రమాదకరమైన గని. ఇక స్టోరీ అమీర్ అనే ఒక మొరాకో యువకుడితో ప్రారంభమవుతుంది. అతను ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫ్రాన్స్‌కు వలస వచ్చి ఈ గనిలో పని చేయడానికి చేరతాడు. అతను రోలాండ్ నేతృత్వంలోని ఒక గని కార్మికుల బృందంలో చేరతాడు. ఈ బృందం గనిలో పనిచేస్తూ రోజువారీ ప్రమాదాలను ఎదుర్కుంటుంది. ఈ ఫ్యాక్టరీ బాస్ ఫౌసియర్ ఒక ఆకర్షణీయమైన బోనస్ ఆఫర్‌తో బృందానికి కొత్త మిషన్ ఇస్తాడు. వీళ్ళు ప్రొఫెసర్ బెర్తియర్ ను గని లోతుల్లోకి తీసుకెళ్లి, అతని శాస్త్రీయ నమూనాలను సేకరించడంలో సహాయం చేయాలి. ప్రొఫెసర్ విలువైన శిలాజాల కోసం అక్కడ వెతుకుతున్నట్లు చెబుతాడు. ఇక ఆ పని మీద ఈ బృందం వెయ్యి మీటర్ల లోతులోకి దిగుతుంది. కానీ ఒక భీకరమైన ల్యాండ్‌స్లైడ్ వారి బయటకు వెళ్లే మార్గాన్ని నాశనం చేస్తుంది. వాళ్ళంతా ఆ గనిలోనే చిక్కుకుంటారు.


ఆ చీకటిలో బయటికి వెళ్ళే మార్గాన్ని వెతుకుతూ ఉండగా, వాళ్ళకు ఒక పురాతన సమాధి కనిపిస్తుంది. ఇది ఒక పురాతన కాలానికి చెందినది. ఈ సమాధిలో వాళ్ళు అనుకోకుండా ఒక రక్తపిపాసి జీవిని మేల్కొల్పుతారు. ఈ జీవి భయంకరమైన రూపంతో, ఎముకలతో కూడిన గ్రోటెస్క్ శరీరంతో అత్యంత క్రూరంగా ఈ బృందాన్ని వేటాడటం ప్రారంభిస్తుంది. అమీర్ తన ధైర్యాన్ని, తెలివిని ఉపయోగించి ఈ బృందాన్ని బయటకు నడిపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రొఫెసర్ దురుద్దేశాలు, బృందంలోని కొందరి దురాశ వారి మనుగడను మరింత కష్టతరం చేస్తాయి. ఇక ఈ స్టోరీ అడ్వెంచర్, సర్వైవల్ హారర్, మిథాలజీ ఎలిమెంట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. చివరికి గనిలో నుంచి వీళ్ళంతా బయట పడతారా ? ఆ క్రియేచర్ చేతిలో సమాధి అవుతారా ? ఆ వింత ఆకారం వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : సినిమా పిచ్చితో పెళ్లి చేసుకునే అమ్మాయి … మొదటి రాత్రే మొగుడికి చుక్కలు

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే

ఈ ఫ్రెంచ్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది డీప్ డార్క్’ (The Deep Dark). 2023 లో వచ్చిన ఈ సినిమాకి మాథ్యూ టూరి దర్శకత్వం వహించారు. 1 గంట 43 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 5.6/10 రేటింగ్ ఉంది. ఇందులో అమీర్ ఎల్ కాసెమ్ (అమీర్), సామ్యూల్ లే బిహాన్ (రోలాండ్), జీన్-హ్యూగ్స్ ఆంగ్లాడ్ (ప్రొఫెసర్ బెర్తియర్) వంటి నటులు నటించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియో హాట్ స్టార్ (Jio hotstar)లలో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×