Thug Life:ప్రముఖ సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ (Kamal Haasan), కోలీవుడ్ దిగ్గజ దర్శకులు మణిరత్నం (Maniratnam ) కాంబినేషన్ లో దాదాపు 38 ఏళ్ల తర్వాత తెరపైకి రాబోతున్న చిత్రం థగ్ లైఫ్ (Thug life). ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా చేపట్టిన చిత్ర బృందం.. నిన్నటికి నిన్న తమిళ్ ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత పలువురులో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఒక ట్రైలర్ విడుదల చేస్తున్నారు అంటే, ఆ సినిమాలోని మెయిన్ అంశాలను ఒక వీడియోగా చేసి రిలీజ్ చేస్తారు. అలాగే థగ్ లైఫ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. కానీ అనూహ్యంగా.. ప్రకటించిన పాత్రలు కనిపించకపోయేసరికి ఆడియన్స్ లో సరికొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
థగ్ లైఫ్ మూవీలో ఇద్దరు స్టార్ హీరోలు..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. కమలహాసన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హీరోయిన్గా నటిస్తోంది. వీరితో పాటు సిలంబరసన్, సన్యా మల్హోత్రా , అభిరామి , అశోక్ సెల్వన్ , ఐశ్వర్య లక్ష్మి , జోజు జార్జ్ , నాసర్ , అలీ ఫజల్ , పంకజ్ త్రిపాఠి , రోహిత్ సరాఫ్ మరియు వైయాపురి, దుల్కర్ సల్మాన్ , జయం రవి వంటి భారీ తారాగణం భాగం అవుతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి తోడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salman),జయం రవి(Jayam Ravi) లకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా విడుదల చేశారు. వీరిద్దరూ చాలా పవర్ఫుల్ పాత్రలలో నటించబోతున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఆ కొంతకాలానికే ఇద్దరు సినిమా నుండి కొన్ని కారణాలవల్ల తప్పుకున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీంతో చిత్ర బృందానికి , వీళ్లకు ఏమైనా విభేదాలు వచ్చాయా అనే కోణంలో కూడా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలు వచ్చిన మరికొన్ని రోజులకే లేదు వీరిద్దరూ ఈ సినిమాలో నటిస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపించారు.
మేకర్స్ సస్పెన్స్ ప్లాన్ చేశారా..?
మొత్తానికి వీరిద్దరూ ఇందులో ఉన్నారా? లేరా? అనే విషయం పక్కన పెడితే.. తాజాగా ట్రైలర్ విడుదల చేయగా.. ఆ ట్రైలర్లో ఇద్దరూ కనిపించకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరూ ఈ సినిమాలో ఉన్నారా? ఒకవేళ ఉంటే వీరిద్దరిపైన ఏదైనా ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నారా..? అందుకే ఇద్దరి పాత్రలను సస్పెన్షన్ లో పెట్టి తెరపై రివీల్ చేయనున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగా వీరిద్దరూ ఈ సినిమాలో ఉన్నారా? లేక సినిమా నుండి తప్పుకున్నారా? అనే విషయం పూర్తిగా తెలియాలి అంటే.. తెరపై సినిమా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్, రెడ్ జెయింట్స్, మద్రాస్ టాకీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ థగ్ లైఫ్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Supritha: హాస్పిటల్ పాలైన సుప్రీత.. ఏం జరిగిందంటే..?