Girl Kills Adopt Parent| మూడు రోజుల పసిపాప అనాథగా రోడ్డుపై పడి ఉంటే ఓ మహిళ ఆ పాపను మానవత్వంతో చేరదీసింది ఆ పాపను దత్తత తీసుకొని పెంచకుంది. 13 ఏళ్ల తరువాత అదే పాప ఆమెను హత్య చేసింది. అంతేకాదు దారుణంగా హత్య చేసి ఆమె గుండెపోటు వల్ల చనిపోయందని చెప్పి త్వరగా అంతక్రియలు కూడా చేసేసింది. కానీ విధి.. అనూహ్యంగా ఆమె చేసిన ఒక తప్పు వల్ల మొత్తం బండారం బయటపడింది. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజలక్ష్మి కార్ అనే 54 ఏళ్ల మహిళ ఏప్రిల్ 29, 2025న అనూహ్యంగా ఇంట్లోనే మరణించింది. ఆమె అంతకుముందే గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుండగా.. అందరూ ఆమె ఆ కారణంగా చనిపోయిందని భావించారు. అయితే రాజలక్ష్మికి 13 ఏళ్ల కూతురు నలిని (పేరు మార్చబడింది) ఉంది. ఆమె త్వరగా తన తల్లి అంతక్రియలు చేయాలని పట్టుబట్టింది. అందుకే మరుసటి రోజే ఏప్రిల్ 30న రాజలక్ష్మి అంతక్రియలు పూర్తి చేశారు.
అయితే రాజలక్ష్మి సోదరుడు సిబా కుమార్ తన సోదరి ఇల్లు, మేనకోడలు తక్కువ వయసు కావడంతో చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో సిబా కుమార్ కు ఇంట్లో తన సోదరి బంగారం మాయమైందని తెలిసింది. దీని గురించి సిబా కుమార్ నలిని ని అడిగాడు. కానీ ఆమె సమాధానం చెప్పకపోగా.. గొడవ చేయడం ప్రారంభించింది. నలిని తీరుపై అనుమానించిన సిబా కుమార్ తన సోదరి ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు ఇంట్లో బంగారంతో పాటు దాదాపు రూ.60000 నగదు కూడా కనిపించడం లేదని ఫిర్యాదు లో పేర్కొన్నాడు. తనకు తన మేనకోడలిపై అనుమానం ఉందని చెప్పాడు
దీంతో పోలీసులు విచారణ చేయడం ప్రారంభించారు. దొంగతనం కేసులో విచారణ చేస్తుండగా పోలీసులకు షాకింగ్ విషయం తెలిసింది. నలిని తన ఇద్దరు స్నేహితులతో కలిసి తనని పెంచిన తల్లిని చంపేసిందని ఆధారాలు బయటపడ్డాయి. నలిని 8 వ తరగతి చదువుతుండగా.. ఆమెకు గణేష్ రాథ్ (21) , దినేష్ సాహు (20) తో పరిచయం ఏర్పడింది. వారితో స్నేహం చేసి పార్టీలక పబ్బులకు వెళ్లేది. అయితే వారితో జల్సాకు డబ్బులు అవసరమవడంతో తన తల్లిని అడిగితే ఆమె నిరాకరించింది. దీంతో తల్లి, కూతరు మధ్య గొడవలు కూడా జరిగాయి.
Also Read: 48 ఏళ్ల క్రితం నాటి హత్య కేసు.. సిగరెట్ ప్యాకెట్ ఆధారంగా హంతకుడిని పట్టుకున్న పోలీసులు
ఈ కారణంగానే నలిని తన స్నేహితులతో కలిసి తన తల్లిని చంపేయాలని ప్లాన్ చేసింది. ఇంట్లో బంగారం, డబ్బులు ఉన్నాయని.. తన తల్లిని చంపేసి వాటిని దోచుకుందామని ఆమె చెప్పడంతో.. ఏప్రిల్ 28 రాత్రి నలిని తన తల్లి రాజలక్ష్మి భోజనంలో నిద్ర మాత్రలు కలిపింది. దీంతో రాజలక్ష్మి నిద్రపోయాక.. ఇంట్లోకి తన ఇద్దరు స్నేహితులను పిలిచింది. వారిలో ఇద్దరు రాజలక్ష్మి కాళ్లు, చేతులు పట్టుకోగా.. ఒకరు ఆమె ముఖంపై దిండుతో బలంగా నొక్కి పట్టుకున్నారు. ఈ కారణంగా ఊపిరాడక రాజలక్ష్మి చనిపోయింది.
ఇంట్లో బంగారం చోరీ కేసులో పోలీసులు నలిని వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ చాట్ లు చెక్ చేయగా.. అందులో ఆమె తన ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య కోసం చేసిన ప్లానింగ్ బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నలిని, ఆమె ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకొని.. రాజలక్ష్మి హత్య కేసులో విచారణ చేపట్టారు.