BigTV English

Supritha: హాస్పిటల్ పాలైన సుప్రీత.. ఏం జరిగిందంటే..?

Supritha: హాస్పిటల్ పాలైన సుప్రీత.. ఏం జరిగిందంటే..?

Supritha:సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయినా సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ సీనియర్ నటీమణి సురేఖ వాణి (Surekha Vani) కూతురు సుప్రీత (Supritha) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు పోటీ ప్రపంచంలో దూసుకుపోతున్న ఈ అమ్మడు.. ఈమధ్య పలు షోలకు యాంకర్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈమె హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకొని ఉన్న ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోల కింద..” దిష్టి నిజమే.. ఈవారం జీవితంలో నేను బలంగా ఎలా ఉండాలో ఆలోచించాను. నేను శివయ్యని నమ్ముతాను. కానీ ఆయనకు నా మీద కోపం వచ్చినట్లు ఉంది. అయినా శివయ్య మా అమ్మ , ప్రసన్న, రమణ లేకుండా నేను లేను. జీవితం ఎప్పుడూ నన్ను పరీక్షిస్తుంది. దిష్టి నా మానసిక ఆరోగ్యాన్ని, నా శారీరక ఆరోగ్యాన్ని ఎఫెక్ట్ చేసింది. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం ఎప్పుడూ ముఖ్యం అంటూ రాసుకొచ్చింది. అయితే ఈమె ఎందుకు ఇలా హాస్పిటల్ పాలయ్యింది అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.


సుప్రీత కెరియర్..

సుప్రీత కెరియర్ విషయానికి వస్తే.. అందం విషయంలో ఈమెకు ఈమె సాటి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కరోనా సమయంలో సినిమాలకు బ్రేక్ రావడంతో తన తల్లి ఇంటిపట్టునే ఉండసాగింది. దీంతో ఏం చేయాలో తెలియక టైం పాస్ కోసం సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ రీల్స్ చేయడం మొదలుపెట్టారు ఈ తల్లి కూతుర్లు. అలా చిత్ర విచిత్రమైన వేషధారణతో గ్లామర్ వొలకబోస్తూ వీడియోలు షేర్ చేసేవాళ్ళు. ఇక వీళ్లిద్దరిని చూసి నిజంగా వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లా లేక స్నేహితుల లేక సిస్టర్స్ అనే రేంజ్ లో కామెంట్లు చేసే వాళ్ళు. ఇక ఇప్పటికీ కూడా ఈ తల్లీ కూతుళ్లు ఇద్దరూ కూడా వెకేషన్స్ కి వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.


సుప్రీత సినిమాలు..

సుప్రీత బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ తో సినిమా చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేదనే చెప్పాలి. మరొకవైపు అమర్దీప్ మాత్రం ఇంకో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఆ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇటు సుప్రీత మాత్రం పలు షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ సెలబ్రిటీల విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తోంది. ఇక అంత బాగానే ఉన్నా ఇప్పుడు ఇలా సడన్గా హాస్పిటల్ పాలవ్వడంతో అభిమానులు ఏమైందని తెలుసుకోవడానికి ఆరా తీస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆమె ఎందుకు ఇలా హాస్పిటల్ పాలయ్యింది..? ఎందుకు దిష్టి తగిలింది? అసలు దిష్టి తగిలింది అని చెబుతోంది? ఎవరి దిష్టి తగిలింది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:Tollywood Hero: హీరోయిన్సే కాదు మేము కూడా.. ఈ యంగ్ హీరో డిమాండ్స్ మామూలుగా లేవుగా..?

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×